న్యూజెర్సీలో ఆటా ఫుడ్ డ్రైవ్ ..ఓపెన్ డోర్ ఫుడ్ ప్యాంట్రీకి డొనేషన్

న్యూజెర్సీలో  ఆటా ఫుడ్ డ్రైవ్ ..ఓపెన్ డోర్ ఫుడ్ ప్యాంట్రీకి డొనేషన్
  • న్యూజెర్సీలో ‘ఆటా’ ఫుడ్ డ్రైవ్
  • ఓపెన్ డోర్ ఫుడ్ ప్యాంట్రీకి డొనేషన్

న్యూజెర్సీ: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) న్యూజెర్సీ విభాగం, యువజన విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఆహార సేకరణ కార్యక్రమం (ఫుడ్ డ్రైవ్) విజయవంతమైంది. న్యూజెర్సీలోని ఫ్రీహోల్డ్‌‌లో ఉన్న ‘ఓపెన్ డోర్ ఫుడ్ ప్యాంట్రీ’కి వీరు 2,000 పౌండ్లకు పైగా నిల్వ ఉండే ఆహార పదార్థాలను విరాళంగా అందించారు. రాబోయే పండుగ సీజన్‌‌లో ఈ ఆహార సామగ్రి 200కు పైగా కుటుంబాలకు ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో ఆటా యువజన విభాగం సభ్యులు ఇషిత మూలె, ఇషాని రెడ్డి కోరం, షణ్ముఖప్రియ మూలె, అయాన్ రెడ్డి తుమ్మల, సహజ ఉల్లపుల, రిషిత జంబుల, సహర్ష కొర్కిశాల పాల్గొన్నారు. వీరితో పాటు రీజినల్ కోఆర్డినేటర్లు  కృష్ణ మోహన్ మూలె, ప్రదీప్ కట్ట, ప్రసాద్ ఆకుల కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. 

ఈ సేవా కార్యక్రమానికి జాతీయ సమన్వయకర్త శరత్ వేముల, ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు వినోద్ కోడూరు, సంతోష్ రెడ్డి, ప్రాంతీయ డైరెక్టర్ విలాస్ జంబుల, మెంబర్‌‌షిప్ చైర్ శ్రీకాంత్ తుమ్మల, వాలంటీర్లు సహాయ సహకారాలు అందించారు. తమకు ప్రోత్సాహం, మద్దతు అందించిన ఆటా చైర్ జయంత్ చల్లా, ప్రెసిడెంట్-ఎలెక్ట్ సతీష్ రామసహాయంలకు న్యూజెర్సీ బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.