ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్న కంపెనీ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) దేశవ్యాప్తగా ఉన్న బీహెచ్ఈఎల్ యూనిట్లలో ఇంజినీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ స్వీకరణ ప్రక్రియ నవంబర్ 25న ప్రారంభం కానుండగా, డిసెంబర్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 415.
విభాగాల వారీగా ఖాళీలు
ఇంజినీర్/ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (200): మెకానికల్ 80, ఎలక్ట్రికల్ 30, ఎలక్ట్రానిక్స్ 25, సివిల్ 15, హెచ్ఆర్ 20, ఫైనాన్స్ 20, ఐటీ/ కంప్యూటర్ సైన్స్ 10.
సూపర్‌వైజర్ ట్రైనీ: మెకానికల్103, ఎలక్ట్రికల్ 30, ఎలక్ట్రానిక్స్ 11, సివిల్ 26, హెచ్ఆర్ 20, ఫైనాన్స్ 25.
విద్యార్హతలు
ఇంజినీర్/ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఐటీ/ కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీఈ/ బి.టెక్ లేదా ఇంటిగ్రేటెడ్/ డ్యూయల్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (హెచ్ఆర్): కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. హెచ్‌ఆర్, పర్సనల్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ వర్క్ విభాగాల్లో రెండేళ్ల ఫుల్-టైమ్ రెగ్యులర్ పీజీ డిగ్రీ/ డిప్లొమా లేదా ఎంబీఏలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. సోషల్ వర్క్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేసిన అభ్యర్థులు తమ చివరి సంవత్సరంలో పర్సనల్ మేనేజ్‌మెంట్, లేబర్ వెల్ఫేర్ లేదా హెచ్‌ఆర్ఎంను స్పెషలైజేషన్ లేదా ఎలెక్టివ్ సబ్జెక్టుగా చదివి ఉండాలి.
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్): గుర్తింపు పొందిన చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) లేదా కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ (సీఎంఏ) ఉత్తీర్ణులై ఉండాలి. కేవలం బీకాం డిగ్రీ ఉన్న అభ్యర్థులు అర్హులు కారు.
సూపర్‌వైజర్ ట్రైనీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 65 శాతం మార్కులతో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగంలో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
సూపర్‌వైజర్ ట్రైనీ (హెచ్ఆర్): కనీసం 65 శాతం మార్కులతో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వర్క్, బిజినెస్ మెనేజ్మెంట్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా బీబీఎస్ లేదా బీఎంఎస్ పూర్తిచేసి ఉండాలి.
సూపర్‌వైజర్ ట్రైనీ (ఫైనాన్స్): కనీసం 65 శాతం మార్కులతో కామర్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
వయసు (2026, నవంబర్ 1 నాటికి): ఇంజినీర్ ట్రైనీ, సూపర్‌వైజర్ ట్రైనీ (అన్ని విభాగాలు) 27ఏళ్లు, ఇంజినీర్ ట్రైనీ (హెచ్ఆర్, ఫైనాన్స్) 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 25.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీలు రూ.1072, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు రూ. 472 చెల్లించాలి.
లాస్ట్ డేట్: డిసెంబర్ 28.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్: 2027, జనవరి 27.
సెలెక్షన్ ప్రాసెస్
ఇంజినీర్/ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ: కంప్యూటర్ – బేస్డ్ ఎగ్జామినేషన్ (సీబీఈ), పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ - బేస్డ్ ఎగ్జామినేషన్ (సీబీఈ)కు 75 శాతం వెయిటేజీ, పర్సనల్ ఇంటర్వ్యూకు 25 శాతం వెయిటేజీ కేటాయించారు.
సూపర్‌వైజర్ ట్రైనీ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కనీస అర్హత మార్కులు: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో అర్హత సాధించాలంటే జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం, ఓబీసీ (నాన్-– క్రీమీలేయర్)/ ఎస్సీ / ఎస్టీ 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
కనీస అర్హత మార్కులు: జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం, ఓబీసీ/ ఎస్సీ/ ఎస్టీ 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ careers.bhel.inను సందర్శించండి.
– వెలుగు, ఎడ్యుకేషన్
