తూప్రాన్, వెలుగు: కోర్టులో న్యాయమూర్తుల కంటే న్యాయవాదుల పాత్ర ఎంతో గొప్పదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు విజయ్‌సేన్ రెడ్డి, చలపతి రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా తూప్రాన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కమ్ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ మెదక్ జిల్లాకు న్యాయమూర్తులుగా కాకుండా, బంధువులుగా వచ్చామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలోని ప్రతిరోజును ప్రత్యేకంగా భావిస్తూ, దానికి అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు.
న్యాయవాద వృత్తి ఎంతో పవిత్రమైనదని, సృజనాత్మకతకు, స్వేచ్ఛకు ఈ వృత్తిలో ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు. యువత న్యాయవాద వృత్తిని ఎంచుకునే ముందు ఎంతో ఆలోచించాలని సూచించారు. న్యాయవాదులు ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయాలని చెప్పారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ బాలల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం న్యాయమూర్తులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి నీలిమ, కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, మున్సిపల్ చైర్పర్సన్ రజిని, డీఎస్పీ నరేందర్, ఆర్డీవో భావయ్య, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
