- గ్యాస్‌పైపు లీకై..ఊట్పల్లిలో పేలిన సిలిండర్
- బంగారం, రూ. 2 లక్షల నగదు,
- పట్టా పాస్‌బుక్ దగ్ధం
- రూ.8 లక్షల ఆస్తినష్టం
పరిగి, వెలుగు : వికారాబాద్‌జిల్లా దోమ మండలం ఊట్పల్లిలో స్టవ్‌పై ఛాయ్పెట్టి బయటకు వెళ్లగా సిలిండర్‌పేలి ఇంట్లోని బంగారం, నగదు, పట్టా పాస్‌బుక్‌లు దగ్ధమయ్యాయి. ఆ టైంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. గ్రామానికి చెందిన బారాది సుధాకర్‌రెడ్డి ఇల్లు కట్టుకుంటున్నాడు. దీంతో పక్కనే ఉండే అనంతర్రెడ్డి ఇంట్లో కిరాయికి ఉంటున్నాడు. ఇంటి నిర్మాణం కోసం రెండు రోజుల కిందటే రూ.2 లక్షలు తీసుకువచ్చి పెట్టుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం సుధాకర్‌రెడ్డి కుటుంబసభ్యులు ఇంట్లో టీ పెట్టి బయటికి వెళ్లిన కొద్దిసేపటికే సిలిండర్‌పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.
సిలిండర్పైపు లీకవ్వడంతో ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. మంటల్లో తన భూమి పట్టా పాసుబుక్‌లు, రెండున్నర తులాల బంగారం, ఇంటి నిర్మాణం దాచుకున్న రూ.2లక్షలు నగదు కాలిపోయాయని సుధాకర్‌రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతేగాకుండా అనంత్‌రెడ్డి ఇల్లు పాక్షికంగా కాలిపోయింది. సుమారుగా 8లక్షల వరకు నష్టం జరిగిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఫైర్ఫైటర్స్మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వం నష్ట పరిహారం అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
