ఫస్ట్ గ్లింప్స్‌తో ఆకట్టుకుంటున్న ‘ఆది రుద్రాక్ష’

ఫస్ట్ గ్లింప్స్‌తో ఆకట్టుకుంటున్న ‘ఆది రుద్రాక్ష’

పంచమహాశక్తులు, మహారహస్యం, దుష్టశక్తుల పోరాటం నేపథ్యంలో రూపొందుతోన్న  మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆది రుద్రాక్ష’.  ఆర్యన్ హీరోగా నటిస్తూ  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షేక్ మహబూబ్ బాషా నిర్మిస్తున్నారు. రూప హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. మంగళవారం ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.  ఈ సందర్భంగా హీరో, దర్శకుడు ఆర్యన్ మాట్లాడుతూ ‘కార్తీక పౌర్ణమి రోజున మా  సినిమా గ్లింప్స్  విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉంది.

 ఎంతో ఇష్టపడి రాసుకున్న కథను వెండితెరపైకి తీసుకొస్తుండటం సంతోషాన్నిస్తోంది.  త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేలా సినిమాను రూపొందిస్తాం’ అని చెప్పాడు. ఇలాంటి మంచి కథలో భాగమవడం హ్యాపీగా ఉందని రూప చెప్పింది. ఈ సినిమా నిర్మాణం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని  నిర్మాత షేక్ మహబూబ్ బాషా అన్నారు.