పంజాగుట్ట, వెలుగు: కార్తీక దీపాలు వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు మంటలు అంటుకుని ఓ వృద్ధురాలు మృతిచెందింది. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ జగన్నాథ్ రెసిడెన్సీలో చాపర్ల కిన్నెర తన తల్లి భానుమతి (64)తో కలిసి నివాసం ఉంటోంది. ఇంట్లో కార్తీక దీపాలు వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు భానుమతి చీరకు మంటలు అంటుకున్నాయి.
ఈ క్రమంలో ఆమె శరీరం పూర్తిగా కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన భానుమతిని అమీర్‌పేటలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు చేతులెత్తేశారు. దీంతో బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ఆమె చనిపోయింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలిచినట్లు ఎస్‌ఆర్ నగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
