యశ్వంత్, ధనశ్రీ వర్మ జంటగా శశి కుమార్ ముత్తులూరి రూపొందించిన న్యూ ఏజ్ లవ్‌స్టోరీ ‘హే కన్నమ్మ’. జీ స్టూడియోస్ సమర్పణలో, దిల్ రాజు ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. నవంబర్ 27న సినిమా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా యశ్వంత్ మాట్లాడుతూ ‘ఈ కథ మనందరి జీవితాల్లో జరిగే పరిస్థితులకు దగ్గరగా ఉంటుంది.
అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ. నాకు అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి ధన్యవాదాలు. నాలో హర్ష క్యారెక్టర్‌ను చూసుకున్న మా డైరెక్టర్‌కు థ్యాంక్యూ’ అని చెప్పాడు. ఈ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందని హీరోయిన్ ధనశ్రీ చెప్పింది. డైరెక్టర్ శశి కుమార్ మాట్లాడుతూ ‘ఇదొక మ్యూజికల్ లవ్‌స్టోరీ. ఈ సినిమా ఒక మ్యూజికల్ కాన్సర్ట్‌లా ఉంటుంది’ అని చెప్పాడు. నటి కార్తీక, డీవోపీ రామ్ పాల్గొన్నారు.
