కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీ రత్న కేటగిరీ–-1 ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంగారెడ్డి జిల్లా భానూర్ యూనిట్‌లో 2026–-27 సంవత్సరానికి గాను ఐటీఐ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 30 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
మొత్తం ఖాళీలు: 134.
విభాగాల వారీగా ఖాళీలు: ఫిట్టర్ 35, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 30, సీఓపీఏ 22, ఎలక్ట్రీషియన్ 11, మెషినిస్ట్ (సి) 9, టర్నర్ 8, వెల్డర్ 6, మెకానిక్ డీజిల్ 4, మెషినిస్ట్ (జి) 3, కెమికల్ ల్యాబ్ 3, ప్లంబర్, మెకానిక్ ఆర్& ఏసీ, ఎంఎంవీ విభాగాల్లో ఒక్కొక్క పోస్టు చొప్పున ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2026, సెప్టెంబర్ 30 నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయసు 30ఏళ్లకు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 20.
లాస్ట్ డేట్: నవంబర్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: సంబంధిత ట్రేడుల వారీగా అభ్యర్థులు సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.apprenticeshipindia.gov.inను సందర్శించండి.
