జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా మారే సమయంలో గ్రహాల మధ్య దూరం ఆధారంగా ప్రతి రాశుల వారి వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తాయి. నవంబర్ 28 వ తేదీన గురుడు.. శుక్ర గ్రహాలు 60 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు ప్రత్యేక సంబంధం ఏర్పడుతోందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇలా రెండు గ్రహాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఐదు రాశుల వారిపై ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .
వృషభ రాశి: గురుడు.. శుక్రుడు సింహరాశిలో 60 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు ఈ రాశి వారికి ప్రతి పనిలో కూడా సానుకూల ఫలితాలుంటాయి. ఉద్యోస్తులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న శు భవార్త వింటారు. పని బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి . పై అధికారుల సహకారం లభిస్తుంది. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎక్కువ లాభాలు ఉంటాయి. పాతబకాయిలు వసూలవుతాయి. పెళ్లి కోసం ఎదురుచూసే వారికి అనుకున్న సంబంధం కుదురుతుంది
మిథున రాశి:సింహరాశిలో గురుడు.. శుక్రుడు సంచరిస్తున్నారు. నవంబర్ 28 వతేదీన ఈ రెండు గ్రహాలు 60 డిగ్రీల దూరంలోకి రానున్నాయి. దీని ప్రభావంతో ఈ రాశి వారు కెరీర్ కు సబందించి గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త చోట నుంచి ఆఫర్ వచ్చే వీలుంది. వ్యాపారంలో పరిస్థితులు మెరుగుపడతాయి. . కుటుంబ సభ్యులమధ్య వివాదాలు పరిష్కారమవుతాయి. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్లు చేపడుతారు. పెండింగ్ లో ఉన్న పనులు పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు పరిచమవుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కలగడంతో సంతోషంగా ఉంటారు.
సింహ రాశి: ఇదే రాశిలో గురుడు, శుక్రుడు సంచరిస్తున్నారు. నవంబర్ 28 వ తేది ఈ రెండు గ్రహాల మధ్య దూరం 60 డిగ్రీలకు రావడంతో ఈ రాశి వారు పట్టింది బంగారం అవుతుంది. ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కుతుంది. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు పరిష్కారమవుతాయి. అయితే ఇతరులతో మాట్లాడేటప్పుడు తొందరపడవద్దని పండితులు చెబుతున్నారు.
తులా రాశి: గురుడు.. శుక్రుడు గ్రహాల మధ్య 60 డిగ్రీల దూరం ఉండటంతో ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు కలుగుతాయి. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. పై అధికారులతో సమన్వయం కుదురుతుంది. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు సూచిస్తున్నారు.పెళ్లి సంబంధం చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి.
ధనుస్సు రాశి: గురుడు.. శుక్ర గ్రహాల మధ్య జరిగే ప్రత్యేక మార్పు వలఈ రాశి వారికి అన్ని విషయాల్లో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులు వేతనం పెరగడంతో పాటు ప్రమోషన్ వస్తుంది. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.సమాజంలో గౌరవం .. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావడంతో మానసికంగా ప్రశాంతత కలుగుతుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
