డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన నషా ముక్త్ భారత్ పాదయాత్ర కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ నుంచి జూబ్లీహిల్స్ వరకు 30కిలోమీటర్ల పాదయాత్ర నవంబర్ 25 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది.
హైదరాబాద్ వాక్ ఫర్ నషా ముక్త భారత్ పేరిట ఈ పాదయాత్ర చేపట్టారు కిషన్‌రెడ్డి. అంబర్‌పేట్‌లోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు.. ఈ పాదయాత్రకు విద్యార్థులుతో పాలు జనం భారీగా తరలివచ్చారు.
పాదయాత్ర ప్రారంభోత్సవంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచందర్‌రావుతో పాటు ఎంపీ లక్ష్మణ్ , మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ నటుడు వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు.
ALSO READ : హనుమకొండలో హై టెన్షన్.. కాంగ్రెస్, BRS కార్యాలయాల దగ్గర భారీగా పోలీసులు
