రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma).. తన స్టయిల్ వేరు.. తన సినిమాలు వేరు.. అన్నింటికీ మించి తన ఆలోచనలు వేరు. నడుస్తున్న సమాజాన్ని.. సమాజంలోని మూఢ నమ్మకాలను.. దేవుడు, దెయ్యం.. ఇలాంటి ఆంశాల్లో తన ఆలోచనలను స్పష్టంగా చెబుతారు. అంతేనా.. వర్మ చెప్పే మాటల్లో లాజిక్ ఉంది కదా అని మనకు మనమే అనుకునేంతగా ఉంటాయి. రాముడి నుంచి నేటి బాలుడు వరకు వర్మ చెప్పే విషయాల్లో లోతైన ఆలోచనలు ఉంటాయి. మనుషులను అతను చూసే విధానం అలాంటిది మరి. అలాంటి రాంగోపాల్ వర్మ ఆలోచనలు AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో వచ్చేశాయి. ఏఐ డిజిటల్ క్లోన్ సిద్ధం చేసినట్లు స్వయంగా ప్రకటించారు వర్మ. తాను చనిపోయినా తన ఆలోచనలు బతికి ఉండటం కోసం.. మనుగడలో ఉండేలా ఈ ఏఐ డిజిటల్ క్లోన్ రూపొంచిందినట్లు వెల్లడించారు వర్మ.
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, నమ్మకాలను ప్రతిబింబించేలా ఈ ఏఐ డిజిటల్ క్లోన్‌ను రూపొందించారు. హరి గాడిపూడి అనే ఏఐ ఇంజనీర్ దీనిని అభివృద్ధి చేశారు. నవంబర్ 24న ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన వర్మ.. తాను చనిపోయిన తర్వాత కూడా తన ఆలోచనలు సజీవంగా ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నేను చనిపోయినా బతికే ఉంటా: వర్మ ఆసక్తికర పోస్ట్
ఈ టెక్నాలజీ గురించి వర్మ ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘నేను చనిపోయిన తర్వాత కూడా జీవించే ఉంటాను. ఏఐ ఇంజనీర్ హరి గాడిపూడి నా డిజిటల్ క్లోన్‌ను రూపొందించారు. ఎవరైనా ఏ అంశంపైనైనా అడిగే ప్రశ్నలకు నా శైలి, నా నమ్మకాల ప్రకారం సమాధానాలు ఇస్తుంది. అంటే నేను చనిపోయినా నా ఆలోచనల రూపంలో బతికే ఉంటాను’ అంటూ తనదైన శైలిలో పేర్కొన్నారు. ఏఐని ముప్పుగా భావించడం కంటే.. దాని ద్వారా సాధ్యమయ్యే కొత్త అవకాశాలను అన్వేషించాలనే ఆలోచనతో ఈ ప్రయోగం చేసినట్లు ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.
ALSO READ : యాపిల్ మ్యాప్స్‌లో రాజమౌళి 'వారణాసి' సెట్స్ లీక్? వైరల్ అవుతున్న షాకింగ్ విజువల్స్!
I will LIVE even after I DIE 💐💐💐 SIMPLY AMAZING… An A I engineer @harigadipudi made a digital clone of me which will answer any question asked by anyone on any subject , exactly in my style and in my belief system.. in other words I will be ALIVE even after I DIE 😌😌😌 https://t.co/GrVDiV13j6
— Ram Gopal Varma (@RGVzoomin) November 24, 2026
ఏ అంశంపైనైనా వర్మ స్టైల్లో సమాధానాలు..
ఈ ఏఐ క్లోన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఏ వ్యక్తి ఏ అంశంపై ప్రశ్న అడిగినా రాంగోపాల్ వర్మ ఆలోచనా విధానంలోనే సమాధానం ఇచ్చేలా దీనిని రూపొందించారు. కేవలం ఆయన మాట్లాడే శైలిని అనుకరించడం మాత్రమే కాకుండా.. ఆయన అభిప్రాయాలు, నమ్మకాలు, ప్రపంచాన్ని చూసే దృక్పథాన్ని కూడా ప్రతిబింబించేలా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అంటే వర్మతో నేరుగా మాట్లాడుతున్న అనుభూతిని ఈ డిజిటల్ క్లోన్ కలిగించనుందన్నమాట.
కేవలం ప్రశ్నలకు సమాధానాలే కాదు.. మరిన్ని ఫీచర్లు!
ప్రస్తుతం ఈ ఏఐ క్లోన్ ద్వారా వర్మ ఆలోచనా విధానంలో సమాధానాలు పొందే అవకాశం ఉండగా.. భవిష్యత్తులో దీనికి మరిన్ని ఫీచర్లు జోడించే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. కథలు రాయడం, స్క్రీన్‌ప్లే రూపొందించడం, ఏఐ సాయంతో సినిమా నిర్మాణానికి సంబంధించిన అంశాలను కూడా ఇందులో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. అదే జరిగితే వర్మ ఆలోచనలతో కథలు, సినిమా కాన్సెప్టులు రూపొందించుకునే సరికొత్త ప్రయోగానికి తెరలేచినట్లే.
ఆర్జీవీ వరుస సినిమాలు..
ఇక సినిమాల విషయానికొస్తే.. రాంగోపాల్ వర్మ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రైమ్ డ్రామా ‘పోలీస్ కంపెనీ’ 2027 జూన్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో ముంబై ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ పాత్రలో హర్షవర్ధన్ రాణే నటిస్తున్నారు. ఫర్దీన్ ఖాన్, ఫాతిమా సనా షేక్, పరేష్ రావల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
To be violent is their qualification Fear is their procedure Hunting criminals is their job And they don’t file FIR’S They just KILL to close the case POLICE COMPANY It’s employees are more dangerous than the D COMPANY employees T SERIES presents A RAM GOPAL VARMA FILM In cinemas JUNE 4 th 2027
— Ram Gopal Varma (@RGVzoomin) October 20, 2026
మరోవైపు, వర్మ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ పేరుతో హారర్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మనోజ్ బాజ్‌పేయి, జెనీలియా దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఓ గ్యాంగ్‌స్టర్ దెయ్యంగా మారి పోలీస్ స్టేషన్‌ను వేధించడం ఈ సినిమా కథాంశం. అలాగే, ‘సర్కార్’ నెక్స్ట్ పార్ట్ ని ప్రస్తుతానికి పక్కన పెట్టిన వర్మ.. ‘సిండికేట్’ పేరుతో మరో ప్రాజెక్టును తెరకెక్కించే పనిలో ఉన్నారు.
A DREADED GANGSTER is KILLED by an ENCOUNTER COP and he COMES BACK as a GHOST to HAUNT the POLICE STATION ..Hence the title “POLICE STATION MEIN BHOOT” You Can’t Arrest The Dead @BajpayeeManoj @geneliad @VauveEmirates @KarmaMediaEnt #uentertainmenthub #PoliceStationMeinBhoot https://t.co/eMOyusT8iy
— Ram Gopal Varma (@RGVzoomin) September 1, 2025
