శ్రీకాళహస్తిలో ఘనంగా చొక్కాని ఉత్సవం...స్వామివారిని భారీగా దర్శించుకున్న భక్తులు

శ్రీకాళహస్తిలో ఘనంగా చొక్కాని ఉత్సవం...స్వామివారిని భారీగా దర్శించుకున్న భక్తులు

శ్రీకాళహస్తి   ముక్కంటి ఆలయంలో అత్యంత వైభవంగా చొక్కాని ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో   వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. శివనామస్మరణతో వాయులింగ క్షేత్రం మారుమోగింది.

 కార్తీకమాసం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి రోజు ( నవంబర్​ 24)  శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో చొక్కాని ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల హరహర మహాదేవ నినాదాలతో ముక్కంటి క్షేత్రం మారుమోగింది.


పురాణాల ప్రకారం పంచభూత లింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చొక్కాని ఉత్సవం కన్నులపండువగా జరిగింది. అధికారులు   ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించగా..  ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ALSO READ : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

కార్తీక మాసం నేపథ్యంలో ముక్కంటి ఆలయంలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పురాతన ఆలయ సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక ఆచారాలకు ప్రతీకగా నిలిచే ఇలాంటి ఉత్సవాలు భక్తుల్లో భక్తిభావాన్ని మరింత పెంపొందిస్తున్నాయి.

వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో చొక్కాని ఉత్సవం వైభవంగా సాగింది. ఓం నమః శివాయ... హరహర మహాదేవ అంటూ భక్తుల శివనామస్మరణతో శ్రీకాళహస్తి క్షేత్రం మారుమోగింది.