Aadarsha Kutumbam OTT: ఓటీటీలోకి ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

 Aadarsha Kutumbam OTT: ఓటీటీలోకి ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

వెంకీ-త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం’ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. విడుదలైన నెల రోజుల్లోపే డిజిటల్‌ తెరపైకి వచ్చేస్తోంది. ఈ వీకెండ్ స్పెషల్గా నవంబర్‌ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌స్ట్రీమింగ్‌ కానుందని తెలిపింది. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్‌ అయిన ప్రేక్షకులు ఇంట్లోనే చూసే అవకాశం దక్కనుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ఇష్టపడేవారికి వీకెండ్ మంచి ఆప్షన్‌ కానుంది.

భారీ అంచనాలు.. బాక్సాఫీస్‌ వద్ద నిరాశ!

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ అనగానే ప్రేక్షకులకు ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ వంటి హిట్‌ సినిమాలు గుర్తుకొస్తాయి. వీరిద్దరి కలయికలో మరోసారి మంచి వినోదాత్మక చిత్రం వస్తుందని అభిమానులు ఆశించారు. ఈ అంచనాల మధ్య అక్టోబర్‌ 30న ‘ఆదర్శ కుటుంబం’ థియేటర్లలో విడుదలైంది. అయితే ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది.

ఓటీటీలోనైనా సక్సెస్‌ అవుతుందా?

థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్‌ కానుండటంతో ఇతర ప్రాంతాల ప్రేక్షకులకూ చేరువయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వెంకటేశ్‌ కామెడీ టైమింగ్‌, త్రివిక్రమ్‌ మార్క్‌ డైలాగ్స్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమాలను ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని ఓటీటీలో ఎలా ఆదరిస్తారో చూడాలి. మరి థియేటర్లలో మిస్‌ అయిన ప్రేక్షకులను డిజిటల్‌ తెరపై ‘ఆదర్శ కుటుంబం’ ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ALSO READ: రాంగోపాల్ వర్మ ఆలోచనలతో AI టూల్