ఒకప్పుడు తన సినిమాలతో నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు తరుణ్ భాస్కర్.. ఇప్పుడు తన మాటలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. ‘ప్రతి సినిమాలోనూ డబ్బు అన్నింటికంటే ముఖ్యం కాదని చెబుతాను. కానీ ఇకపై డబ్బునే ఫాలో అవుతా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనను తక్కువ అంచనా వేస్తున్నారని, ఇకపై తన సినిమా సత్తా ఏంటో బాక్సాఫీస్ దగ్గర చూపిస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ (ENE Repeat) సినిమా సక్సెస్ మీట్లో తరుణ్ భాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా A, B, C సెంటర్ల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తానని చెప్పడం, తన తదుపరి సినిమా విషయంలో డబ్బు, బాక్సాఫీస్ వసూళ్లకు ఇంపార్టెన్స్ ఇస్తానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
డబ్బే ముఖ్యం.. ఇక తగ్గేదేలే: తరుణ్ భాస్కర్
వైజాగ్‌లో నిర్వహించిన ‘ENE Repeat’ సక్సెస్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్ మాట్లాడిన మాటలు.. సాధారణ థ్యాంక్స్ స్పీచ్‌లా సాగలేదు. తన కెరీర్, సినిమాల ఎంపిక, బాక్సాఫీస్ విషయంలో తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటున్నాననే సంకేతాలు ఇచ్చారు. ఇప్పటివరకు తన సినిమాల్లో డబ్బు కంటే భావోద్వేగాలకు, ఇష్టాలకు ప్రాధాన్యత ఇచ్చానని, ఇకపై మాత్రం వసూళ్లను కూడా సీరియస్‌గా తీసుకుంటానని చెప్పారు.
తరుణ్ భాస్కర్ స్పీచ్ హైలెట్స్..
- “MONEY ISN'T EVERYTHING”: ఇప్పటివరకు ప్రతి సినిమాలోనూ డబ్బు అన్నింటికంటే ముఖ్యం కాదనే విషయాన్ని చెప్పానని, కానీ ఇకపై డబ్బునే ఫాలో అవుతానని అన్నారు.
- నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు: – తన సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారని, తనలోని అసలు సత్తా ఏమిటో చూపిస్తానని వ్యాఖ్యానించారు.
- A, B, C సెంటర్స్ అన్నీ కొడతా: కేవలం ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే కాకుండా అన్ని సెంటర్ల ప్రేక్షకులకు నచ్చే సినిమా చేయాలనేది తన తదుపరి లక్ష్యమని స్పష్టం చేశారు.
- “బయట తప్పు జరిగితే సినిమాలో కరెక్ట్ చేస్తా: తన అభిప్రాయాలను, ఆలోచనలను సినిమా ద్వారానే బలంగా చెప్పగలననే ధీమా వ్యక్తం చేశారు.
- ఇప్పటినుంచి డ్యూటీ ఎక్కుతున్నా.. దిగే ప్రసక్తే లేదు: ఇకపై తన ప్రయాణం ఆగదనే పట్టుదలను మాటల్లో చూపించారు.
అంతేకాదు, తనను ప్రేమించిన ప్రేక్షకుల గురించి మాట్లాడుతూ.. అందరూ బయట లెక్కలు చూస్తున్నారని, కానీ తనను మాత్రం ఎలాంటి లెక్కలు లేకుండా ప్రేమించింది ప్రేక్షకులేననే భావోద్వేగాన్ని కూడా వ్యక్తం చేశారు. డైరెక్షన్‌ను కేవలం కూలి పనిగా చూడకూడదని, చదువుకుని, ఇష్టంతో, ఒక అభిరుచితో చేసే సృజనాత్మక పనిగా చూడాలనే ఆయన అభిప్రాయం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.
ENE 2 సక్సెస్ జోష్..
తరుణ్ భాస్కర్ స్పీచ్‌కు నేపథ్యంగా నిలిచింది సినిమా సాధించిన వసూళ్లే. 2018లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ‘ENE Repeat’ నవంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తున్నట్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఇది రూ. 50 కోట్ల మార్కు వైపు దూసుకుపోతోంది.
ALSO READ : శ్రీలంకలో ఎంజాయ్ చేస్తున్న అల్లు ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్!
తరుణ్ భాస్కర్ నెక్స్ట్ ప్లాన్ ఇదే!
నెక్స్ట్ సినిమాతో A, B, C సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకోవడమే లక్ష్యమని తరుణ్ భాస్కర్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఇప్పటివరకు తనదైన కథనం, హాస్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇక బాక్సాఫీస్పైనా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అయితే కొత్త సినిమా ఏంటనేది అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.
మొత్తానికి.. ‘పెళ్లి చూపులు’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్, ‘ఈ నగరానికి ఏమైంది’తో యూత్‌లో స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ‘ENE Repeat’ సక్సెస్ తో మరోసారి తన దర్శకత్వ సత్తాను చాటుకుంటూ, నెక్స్ట్ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుంటానని చెబుతున్నారు. ఆయన మాటల్లో కనిపిస్తున్న ఈ కసి, నెక్స్ట్ చిత్రంలో ఎంతవరకు ప్రతిఫలిస్తుందో చూడాలి!
