గోదావరిలో మిగులు జలాలుగానీ.. వరద జలాలు గానీ లేవని ఇప్పటికీ సెంట్రల్ వాటర్ కమిషన్ (సీ డబ్ల్యూసీ) ఎన్నో సందర్భాల్లో చెప్పింది. అసలు వాటి టెక్కే తేలలేదని స్పష్టం చేసింది. కానీ, ఆ లెక్కలేవీ తేలకుండానే బనకచర్ల ప్రాజెక్టును కట్టేందుకు చం ద్రబాబు రెడీ అయ్యారు.
2024లోనే దాని డిజైన్లు కూడా ఖరారుచేశారు. పోలవరం కుడి కాల్వ ద్వారా రోజూ 2 టీఎంసీల చొప్పున వంద రోజుల్లో 200 టీఎంసీల నీటిని ఎత్తిపోసి టన్నెళ్లు, కాల్వల ద్వారా 400 కిలోమీటర్ల దూరం లోని చన క్రాస్ రెగ్యులేటర్ కు తరలించాలన్నది ఆయన వ్యూహం. అందుకు మధ్యలో సాగర్ నూ వాడేసుకున్నారు.
కుడికాల్వ దగ్గర కెనాల్ వెడల్పు చేయడం. అక్కడ ఆక్విడక్ట్ ను నిర్మించడం అక్కడి నుంచి 150 టీఎంసీల సా మర్ద్యంతో నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్ కు తర లించడం ప్లాన్లోభాగం. ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు తలచుకున్న అంచనా వ్యయం రూ.81,900 కోట్లు. ఈ నిధుల కోసం ప్రత్యేకంగా జలహారతి అనే కార్పొ రేషన్ ను నిరుడు ఏర్పాటు చేశారు.
Also Read : తెలంగాణ ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డుపడుతూ.. లేఖపై లేఖలు రాస్తున్నారు
కానీ తెలంగాణ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడం పర్యావరణ శాఖ నుంచి క్లియరెన్సులు రాకపోవడంతో మళ్లీ దానిని పోలవరం నల్లమలసాగర్ అని రూటుమా ర్చేశారు. రూటు మారిందే తప్పు నీటి దోపిడీ ప్లాన్ లో ఎలాంటి మార్పూ లేదు. ఇక్కడితో ఆగిపోలేదు. తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టేలా బాబు మరో ఎత్తుగడ వేశారు.
ముందుగా అనుకున్న ఇచ్చం పల్లి లేదా సమ్మక్క సాగరక్కు బడులు ఇప్పటికే రెడీగా ఉన్న పోలవరం నుంచే గోదావరి కావేరి లింక్‌ను చేపట్టాలని కేంద్రం ముందు ప్రతిపాదించారు. ప్రతి మీటింగ్ లోనూ పోలవరం బనకచర్లపై ప్రకటనలు చేస్తున్నారు. నిరుడు మేలో మహానాడు. ఆగస్టు 15, ఈ ఏడాది జనవరి 5న జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు, ఇటీవల జరిగిన సీఐఐ సదస్సులోనూ పోలవరం, బనకచర్ల ప్రాజెక్టు కట్టితీరుతామంటూ స్టేట్ మెంట్లు ఇచ్చారు.
కూటమిలో భాగస్వామిగా ఉన్న అవకాశాన్ని అలుసుగా తీసుకొని ఈ ఏడాది వరుసగా కేంద్ర మంత్రులు, ప్రధానిని కలుస్తూ ఆ ప్రాజెక్టును ముందుకు తీసు కెళ్లేందుకు చంద్రబాబు. చేయని ప్రయత్నం లేదు..
