తెలంగాణ నీళ్లపై చంద్రబాబు కుట్ర : తెలంగాణ ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డుపడుతూ.. లేఖపై లేఖలు రాస్తున్నారు

తెలంగాణ నీళ్లపై చంద్రబాబు కుట్ర : తెలంగాణ ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డుపడుతూ.. లేఖపై లేఖలు రాస్తున్నారు

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు అభ్యంతరాలు, కేంద్రానికి వరుస ఫిర్యాదులు.. మరోవైపు ఏపీలో కొత్త ప్రాజెక్టుల అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు.  2015 నుంచి 2026 వరకు పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం సహా పలు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేంద్రానికి, కృష్ణా–గోదావరి బోర్డులకు చంద్రబాబు ప్రభుత్వం లేఖలు రాస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్‌ల వెనక్కి పంపడం, అనుమతులపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం వెనక ఏపీ ప్రభుత్వ ఒత్తిడి ఉందన్న విషయం స్పష్టమవుతోంది. 

అనేక అక్రమ ప్రాజెక్టులు చేపడుతున్న చంద్రబాబు సర్కార్ తెలంగాణ ప్రాజెక్టులకు సూత్రం అడుగడుగునా మోకాలడ్డుతోంది కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి సహా పలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు 2015 నుంచి 2026 వరకు చంద్రబాబు ఎన్నో లేఖలు రాశారు. 

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకో వాలంటూ 2015 జులైలో అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతికి బాబు లేఖ రాశారు. మన ప్రాజెక్టులను అడ్డుకోవడానికి పడిన మొదటి అడుగు చంద్రబాబుదే కావడం గమనార్హం కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూ సీ అనుమతులను వృతిరేకిస్తూ చంద్రబాబు 2018 జూన్ 13న కేంద్రానికి అధికారికంగా లేఖ రాశారు. 

ఇది పునర్విభజన చట్టానికి విరుద్ధమని, సీడబ్ల్యూసీ అనుమతులను సమీక్షించాలని కోరుతూ అప్పట్లో ఏపీ ప్రభుత్వం దాదాపు 8 లేఖలు రాశారు. పాలమూరు రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, కాళేశ్వరం ప్రాజెక్టులను ఆపాలని డిమాండ్ చేస్తూ 2014 నుంచి 2018 వరకు చంద్రబాబే మొత్తం 30 లేఖలు రాశారన్న ఆరోపణలూ ఉన్నాయి. 

Also Read : శ్రీశైలం కుడి కెనాల్ పనులూ జోరుగా సాగుతున్నాయి

చంద్రబాబు పెట్టిన మెలికలతోనే 2024 డిసెంబర్లో పాలమూరు రంగారెడ్డి, వార్దా, కాళేశ్వ రం థర్డ్ టీఎంసీల డీపీఆర్లు వెనక్కు వచ్చాయన్న విమర్శలూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం 42 అక్రమ ప్రాజెక్టులను చేపట్టిందంటూ 2025 డిసెంబర్ లో చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖల ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో కాళేశ్వరం,  చౌటుపల్లి హన్మంతరావు, చిన్న కాళేశ్వరం, చనాక కొరాట, మోదికుంట వాగు, కడెం గూడెం, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులను ఆపాలని, సమ్మక్క బ్యారేజీ అనుమతులు రద్దు చేయాలని కోరుతూ జీఆర్ఎంబీ మీటింగ్ ఎజెండా పంపించారు. 

గోదావరి బోర్డు మీటింగ్ ఎజెండాలోనూ చేర్చడం గమనార్హం. ఆ తర్వాత కొన్ని నెలలకే కేంద్ర ప్రభుత్వం సమ్మక్కసా గర్ డీపీఆరూ వెనక్కు పంపించింది చంద్ర బాబు కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.