హైదరాబాద్, వెలుగు : గ్లోబల్ ఐటీ సేవల సంస్థ ఎవర్‌నెక్స్ తన హెడ్ఆఫీస్ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. డేటా సెంటర్లు, టెక్నాలజీ రంగ సంస్థలకు మరింత చేరువ కావడం ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం. సర్వర్లు, స్టోరేజ్, నెట్‌వర్క్ పరికరాల నిర్వహణతో పాటు పాత ఐటీ పరికరాల జీవితకాలాన్ని పెంచే సేవలను సంస్థ అందిస్తుంది. తయారీ సంస్థల సాధారణ సపోర్ట్ గడువు ముగిసిన తర్వాత కూడా పరికరాలను నిర్వహించుకునేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయి.
160కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎవర్‌నెక్స్‌కు ఐటీ రంగంలో 40 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. రాబోయే మూడేళ్లలో దేశంలో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
