బంగారం రేట్లు ఊహించని స్థాయిలో తగ్గి రిలీఫ్ ఇచ్చినప్పటికీ మళ్లీ పెరుగుతూ కొనుగోలుదారులకు కార్తకమాసంలో షాక్ ఇస్తున్నాయి. నిన్నమెున్నటి వరకూ పడిపోయిన రేట్లు మళ్లీ పుంజుకోవటంతో పండుగ షాపింగ్, పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆభరణాలు కొనేవారిలో ఆగాలా కొనాలా అనే డైలమా నడుస్తోంది. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ సమీప నగరాల్లోని రిటైల్ విక్రయ ధరలను పరిశీలించటం బెటర్.
హైదరాబాద్ లో 2026, నవంబర్ 26వ తేదీ బంగారం ధరలు ఇలా ఉన్నాయి :
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : లక్షా 25 వేల 890 రూపాయలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : లక్షా 15 వేల 400 రూపాయలు
18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : 94 వేల 420 రూపాయలు
ఇక వెండి ధర విషయానికి వస్తే.. హైదరాబాద్ సిటీలో కిలో వెండి : లక్షా 65 వేల రూపాయలు
నవంబర్ 26న బంగారం రేట్లు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాముకు 2వేల610 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.12వేల 589గా కొనసాగుతోంది. గురువారం రోజున రూ.లక్షా 25వేల 890కి చేరుకుంది. అలాగే ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.11వేల 540గా కొనసాగుతోంది. అంటే 10 గ్రాముల బంగారం రేటు అంటే తులం రూ.లక్షా 15 వేల 400 వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.
ALSO READ : స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ.. ఒక్కరోజే రూ.3.49 లక్షల కోట్ల లాభం!
గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. నవంబర్ 26, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.లక్షా 65వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.165 దగ్గర ఉంది. రానున్న రోజుల్లో ఈ రేట్లు ఇంకా తగ్గొచ్చని బులియన్ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
