మస్క్ ను కూడా కాపాడా..డొనాల్డ్ ట్రంప్‌‌‌‌ కామెంట్స్

మస్క్ ను కూడా కాపాడా..డొనాల్డ్ ట్రంప్‌‌‌‌ కామెంట్స్
  • తాను లేకుంటే టెస్లా చీఫ్​ ఉండేటోడే కాదని వెల్లడి

వాషింగ్టన్‌‌‌‌: తాను లేకుంటే ఈ రోజు టెస్లా అధినేత ఎలాన్‌‌‌‌ మస్క్‌‌‌‌ ఉండేవాడు కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌‌‌‌ ట్రంప్‌‌‌‌ అన్నారు. సోమవారం ఓ టీవీ ఇంటర్వ్యూలో హువాంగ్‌‌‌‌ జెన్సన్‌‌‌‌ తిరిగి ఎన్విడియా సీఈఓగా రావడంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మరో టీవీ చర్చలో ట్రంప్ మాట్లాడుతూ, తన మొదటి అధ్యక్ష పదవీకాలంలో మస్క్ పెద్ద చిక్కుల్లో పడ్డారని పేర్కొన్నారు. అప్పట్లో ఒక క్లిష్టమైన సంఘటన జరిగిందని ప్రస్తావించిన ఆయన.. ఆ వివరాలు ఏమిటన్నది వెల్లడించలేదు. మస్క్‌‌‌‌ను చూసి తాను గర్వపడుతున్నానని, ఆయనొక ‘సూపర్ జీనియస్’అని కొనియాడారు. 

‘మస్క్‌‌‌‌ 80 శాతం సూపర్ జీనియస్, మిగిలిన 20 శాతం ఆయనకు ఇతర సమస్యలు ఉన్నాయి. ఈ విషయాన్ని నేను నేరుగా ఆయనతోనే చెబుతుంటాను’అని పేర్కొన్నారు. కాగా, తన తొలి అధ్యక్ష పాలనలో మస్క్‌‌‌‌ ఏ విషయంలో పెద్ద ఇబ్బందుల్లో పడ్డారో ట్రంప్‌‌‌‌ స్పష్టంగా చెప్పలేదు.