సందేశాత్మక ఆలోచన.. చిరంజీవి ట్రైలర్ లాంచ్ చేయడంతో పెరిగిన అంచనాలు

సందేశాత్మక ఆలోచన.. చిరంజీవి ట్రైలర్ లాంచ్ చేయడంతో పెరిగిన అంచనాలు

సీనియర్ నటులు జీవీ నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, సుధాకర్ కొడుకు బెన్నీ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘ఆలోచన’.  సురేందర్ చాచా దర్శకత్వంలో ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మించారు.  నవంబర్ 27న సినిమా విడుదల కానుంది. 

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీమియర్‌‌‌‌కు ఆర్‌‌.నారాయణమూర్తి, మురళీమోహన్‌‌, తమ్మారెడ్డి భరద్వాజ్‌‌, కరాటె కళ్యాణి, నటి రాగిణి అతిథులుగా హాజరయ్యారు. రొటీన్‌‌కి భిన్నంగా ఉందని మురళీ మోహన్ అన్నారు. తల్లిదండ్రులను దేవుడితో సమానంగా చూడాలని,  కుటుంబ విలువలను కాపాడుకోవాలనే గొప్ప సందేశాన్ని ఈ చిత్రంతో ఇచ్చారని  ఆర్‌‌.నారాయణమూర్తి చెప్పారు. 

చిరంజీవి గారు ట్రైలర్‌‌‌‌ లాంచ్ చేయడం సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ థియేటర్‌‌లో చూసి ఆదరించాలని సినిమాను విడుదల చేస్తున్న సురేష్ కొండేటి అన్నారు. నటీనటులు నర్సింహరాజు,  జయలలిత,  బెన్నీ సుధాకర్‌‌, అనుపమ, మాధవితో పాటు దర్శకనిర్మాతలు పాల్గొన్నారు.