బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఫోర్స్ 3’. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి గ్లామర్‌ను యాడ్ చేయబోతోంది. ఇందులో ఆమె ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేయబోతోంది. గతంలో జాన్ అబ్రహం, నోరా ఫతేహి కాంబినేషన్‌లో వచ్చిన ‘దిల్బర్’ (సత్యమేవ జయతే), ‘ఓ సాకీ సాకీ’ (బాట్లా హౌస్), ‘కుసు కుసు’ (సత్యమేవ జయతే 2) పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఈ హిట్ పెయిర్ ‘ఫోర్స్ 3’ కోసం తిరిగి కనువిందు చేయబోతోంది. మాస్ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసేలా, గ్రాండ్ విజువల్స్‌తో ఈ పాటను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భవ్ ధులియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫ్రాంచైజీలోని గత రెండు చిత్రాల్లో పోషించిన ఏసీపీ యశ్‌వర్ధన్ సింగ్ పాత్రలో జాన్ అబ్రహం మరోసారి కనిపించనున్నారు. హర్షవర్ధన్ రాణే, తాన్యా మానిక్తలా, సూర్య శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న సినిమా విడుదల కానుంది. నోరా ఫతేహి పాటకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావలసి ఉంది.
