‘భోగి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది

‘భోగి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది

‘‘నా కెరీర్‌‌లో 37 సినిమాలకు ఎంత కష్టపడ్డానో, ‘భోగి’ ఒక్క సినిమాకు అంత కష్టపడ్డాను. కచ్చితంగా ప్రేక్షకులకు ఓ  కొత్త సినిమా, డిఫరెంట్ సినిమా చూసిన ఎక్స్‌‌పీరియన్స్ ఇస్తుంది. ప్రేక్షకులు సినిమా చూశాక ‘ఇదిరా సినిమా’ అనేలా ఉంటుంది’’ అని చెప్పారు శర్వానంద్. సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ‘గంగా’ పాటను విడుదల చేయడం సంతోషంగా ఉందని,  ఈ సినిమాకు భీమ్స్‌‌ మ్యూజిక్, చంద్రబోస్‌‌ సాహిత్యం  బిగ్గెస్ట్ పిల్లర్స్‌‌గా నిలిచాయని శర్వానంద్‌‌ చెప్పారు. 

ఇప్పటివరకు శర్వానంద్‌‌లో బెస్ట్ చూశారని, ఈ సినిమాతో బీస్ట్‌‌ చూడబోతున్నారని దర్శకుడు సంపత్‌‌ నంది  అన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా చంద్రబోస్‌‌ ఈ పాటలు రాశారని, భీమ్స్ ఎనర్జీ లేకపోతే పాటలు ఇంత అద్భుతంగా వచ్చేవి కావని ఆయన వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో  హీరోయిన్ డింపుల్ హయాతి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, లిరిక్ రైటర్ చంద్రబోస్, నిర్మాత కేకే రాధామోహన్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.