‘‘చాలామంది నన్ను తక్కువ అంచనా వేశారు. ఇక డ్యూటీ ఎక్కుతున్నా. నా నెక్స్ట్ సినిమా నుంచి ఏ, బీ, సీ సెంటర్స్ అన్నింటిపై ఫోకస్ చేసి సినిమాలు చేస్తాను. మోకాళ్ల మీద పడి ప్రతి ఒక్కరినీ సార్, మేడం అని పిలవను. నాకు జనమే ముఖ్యం. నేను డైరెక్షన్ చేసినా, యాక్టింగ్ చేసినా శ్రద్ధ పెట్టి చేస్తాను. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగినా దాన్ని సినిమా ద్వారా కరెక్ట్ చేస్తాను” అని దర్శకుడు తరుణ్ భాస్కర్ అన్నారు.
ఆయన తెరకెక్కించిన చిత్రం ‘ఈఎన్‌ఈ రిపీట్’. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి నటించారు. సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతున్న నేపథ్యంలో బ్లాక్‌బస్టర్ రిపీట్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. తమ చిత్రానికి ప్రేక్షకులు లెక్కలేనంత ప్రేమను ఇచ్చారని, ప్రేక్షకులే గేమ్ ఛేంజర్స్ అంటూ ఆడియన్స్‌కు తరుణ్ భాస్కర్ థ్యాంక్స్ చెప్పారు.
ఈ సినిమాకే కాదు, తన లైఫ్‌కు కూడా తరుణ్ భాస్కరే హీరో అని విశ్వక్ సేన్ చెప్పారు. ఇప్పటికే యూఎస్‌లో బ్రేక్ ఈవెన్ అయిన ఈ చిత్రం త్వరలో రూ. 50 కోట్లు టచ్ చేస్తున్నట్టు విశ్వక్ తెలిపారు. అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, శివాత్మిక, అనీషా, శ్రీరామ్ చంద్ర, లిరిక్ రైటర్ చంద్రబోస్, నిర్మాతలు సృజన్, సందీప్ నాగిరెడ్డి పాల్గొన్నారు.
