పంజాగుట్ట, వెలుగు :దేశంలోనే మొట్టమొదటి ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట ఠాణా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం స్టేషన్ను సందర్శించారు.
స్టేషన్లో ఏఐ సేవల కోసం జరుగుతున్న టెక్నికల్పనులను పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడారు. ఏఐ ద్వారా వారి సమస్యలను సిబ్బంది ఏ విధంగా స్వీకరించి పరిష్కరిస్తారో అడిగి తెలుసుకున్నారు.
వెంట సీపీ మహేష్ భగవత్, అడిషనల్ డీజీపీ (లా అండ్ ఆర్డర్) అకున్ సభర్వాల్, హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైమ్స్ అండ్ సిట్) ఎం.శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ డీఐజీ భాస్కరన్, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి, టీఎస్‌పార్క్ఎస్పీ రూపేశ్ ఉన్నారు.
