దొంగలు పగబట్టారు..మరోసారి అదే వైన్స్ లో ..యాలాల ఎస్ఎల్వీ వైన్స్లో మళ్లీ చోరీ

దొంగలు పగబట్టారు..మరోసారి అదే వైన్స్ లో ..యాలాల ఎస్ఎల్వీ వైన్స్లో మళ్లీ  చోరీ

తాండూరు వెలుగు : వికారాబాద్​ జిల్లా యాలాల మండల కేంద్రంలోని ఓ వైన్స్​ను దొంగలు వదిలిపెట్టడం లేదు. 7 నెలల కిందట చోరీ చేసిన దొంగలు..మంగళవారం మళ్లీ అదే వైన్స్​పై తమ ప్రతాపం చూపించారు. యాలాలలో ఎస్‌‌‌‌ఎల్వీ వైన్స్‌‌‌‌లో ఏప్రిల్ లో రేకులు తొలగించి లోపలకు ప్రవేశించిన చోరులు రూ.5 వేల నగదుతో పాటు మద్యం బాటిల్స్​ఎత్తుకుపోయారు. ఆ ఘటన మరువకముందే మంగళవారం అర్ధరాత్రి మళ్లీ అదే వైన్స్ గోడ పైభాగంలో రంధ్రం చేసి  వెళ్లి రూ18వేల నగదు, రెండు బ్లాక్ అండ్ వైట్ బాటిల్స్​, మూడు ఓసీ బాటిల్స్​ అపహరించారు. చోరీ విజువల్స్ ​ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ విఠల్​రెడ్డి తెలిపారు.