‘బేబీ’ చిత్రంతో తెలుగులో చక్కని గుర్తింపును అందుకున్న వైష్ణవి చైతన్య.. కోలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది. ఆర్యకు జంటగా ఆమె నటించిన చిత్రం ‘హలో కాదల్’. నిఖిలా విమల్ మరో హీరోయిన్‌గా నటించింది. మలయాళ దర్శకుడు నిఖిల్ మురళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ సినిమాను ‘హలో ప్రేమ’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్‌ను చూస్తుంటే ఇదొక ట్రయాంగిల్ లవ్‌స్టోరీలా కనిపిస్తోంది. ఆర్య రెండు ప్రేమకథలు ఎలా మొదలయ్యాయి, ఎక్కడ ఢీకొన్నాయి అనే అంశాల చుట్టూ సాగే కామెడీ ఎంటర్‌టైనర్ ఇదని అర్థమవుతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డిసెంబర్ 4న సినిమా విడుదల కానుంది.
