ఐసీఏఆర్- భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ (ఐఐఓఆర్) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ పై అవగాహన, టైపింగ్ నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ట్యాలీ, ఎంఎస్ ఆఫీస్ నైపుణ్యాలు అదనపు అర్హతగా పరిగణిస్తారు.
వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: డిసెంబర్ 8, 9.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ icar-iior.org.in ను సందర్శించవచ్చు.
- వెలుగు, ఎడ్యుకేషన్
