తెలంగాణలో కే2 జెనాక్స్ విస్తరణ.. టీఎంటీ స్టీల్ ఉత్పత్తి 15శాతానికి పెంపు

తెలంగాణలో కే2 జెనాక్స్ విస్తరణ.. టీఎంటీ స్టీల్ ఉత్పత్తి 15శాతానికి పెంపు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తోందని, దీంతో తమ బిజినెస్‌‌‌‌‌‌‌‌ను విస్తరించాలని నిర్ణయించామని  స్టీల్​ బార్స్​  కంపెనీ కే2 జెనాక్స్ ప్రకటించింది.  పెరుగుతున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌ను అందుకునేందుకు ఏడాదిలోగా టీఎంటీ  స్టీల్ బార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని 15 శాతం పెంచుతామని తెలిపింది.  వచ్చే ఏడాదిలో తాపీ మేస్త్రీలు, బిల్డర్లతో సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో తమ డీలర్ల నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను 10శాతం పెంచనున్నట్లు కంపెనీ డైరెక్టర్ సునీల్ అగర్వాల్ తెలిపారు.  భూకంపాలను సైతం తట్టుకునేలా ప్రత్యేక డిజైన్‌‌‌‌‌‌‌‌తో వీటిని తయారు చేస్తున్నామని అన్నారు.