ఫోన్‌పే మరోసారి ఐపీఓకు సిద్ధం.. రూ.14 వేల కోట్ల సమీకరణ లక్ష్యం

ఫోన్‌పే మరోసారి ఐపీఓకు సిద్ధం.. రూ.14 వేల కోట్ల సమీకరణ లక్ష్యం

న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ ఫోన్‌‌‌‌‌‌‌‌పే  తన ఐపీఓ ప్లాన్‌ను మళ్లీ పట్టాలెక్కించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చి నెలల్లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ విలువను రూ. 1.2 లక్షల కోట్ల నుంచి రూ. 1.5 లక్షల కోట్లు (12–15 బిలియన్ డాలర్లు)గా లెక్కగట్టగా, ఐపీఓ ద్వారా రూ. 12,000–14,000 కోట్లు సమీకరించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.  

గతంలో మార్కెట్ ఒడిదుడుకుల వల్ల  సెబీ వద్ద పేపర్లు సబ్మిట్ చేయలేదు. త్వరలో ఐపీఓ పేపర్లు సబ్మిట్ చేస్తామని కంపెనీ పేర్కొంది. ఇందులో కొత్త షేర్లు కాకుండా, పాత ఇన్వెస్టర్లు తమ వాటాలను అమ్ముకునే ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌) మాత్రమే 
ఉంటుంది.