ఇథనాల్, కరెంట్‌తో నడిచే ఇన్నోవా హైక్రాస్.. ధర రూ.19.99 లక్షల నుంచే స్టార్ట్

ఇథనాల్, కరెంట్‌తో నడిచే ఇన్నోవా హైక్రాస్.. ధర రూ.19.99 లక్షల నుంచే స్టార్ట్

ఈ85  పెట్రోల్‌తో కూడా నడిచే  కారును టయోటా లాంచ్‌ చేసింది. ఇథనాల్‌+ కరెంట్‌ రెండింటితో నడిచే హైబ్రిడ్‌  మోడల్‌ ‘ఇన్నోవా హైక్రాస్’ ను తీసుకొచ్చింది.  దేశంలో ఈ రెండు టెక్నాలజీల కలయికతో వచ్చిన మొట్టమొదటి కారు ఇదే!  ఈ కారులో  2.0-లీటర్ ఇంజిన్ 20శాతం నుంచి 85శాతం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో  సులభంగా నడుస్తుంది.  సాధారణ ఎలక్ట్రిక్ కార్లలాగా దీన్ని ప్లగ్ పెట్టి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. కారు నడుస్తున్నప్పుడు, బ్రేక్ వేసినప్పుడు ఉత్పత్తి అయ్యే శక్తితో ఇందులోని బ్యాటరీ దానంతట అదే ఛార్జ్ అవుతుంది. తక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు కారు పూర్తిగా ఎలక్ట్రిక్ మోటార్ సాయంతోనే నడుస్తుంది.  ఈ కారు జీ, జీఎక్స్‌, వీఎక్స్, జెడ్ఎక్స్ వేరియంట్లలో రూ. 19.99 లక్షల ప్రారంభ ధరతో (టాప్ మోడల్ రూ. 31.99 లక్షలు) అందుబాటులోకి వచ్చింది.