ఇండియాపై 25శాతం టారిఫ్.. మరోసారి అమెరికా పన్ను ప్రతిపాదన

ఇండియాపై 25శాతం టారిఫ్.. మరోసారి అమెరికా పన్ను ప్రతిపాదన
  • జనవరి 25 న దీనిపై బహిరంగ విచారణ
  • మరోసారి అమెరికా పన్ను ప్రతిపాదన
  • ట్రేడ్ డీల్ కుదిరితే 17 శాతానికి తగ్గింపు

వాషింగ్టన్: అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరకపోతే భారత ఉత్పత్తులపై 25% వరకు దిగుమతి సుంకాలు (టారిఫ్​ లు ) విధిస్తామని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (యూఎన్టీఆర్) బుధవారం ప్రతిపాదించింది. 

ఒకవేళ వాణిజ్య ఒప్పందం కుదిరితే టారిఫ లు  17 శాతానికి పరిమితమవుతాయని స్పష్టం చేసింది. అతిగా పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యం, మార్కెట్ ప్రవేశ అడ్డంకులు, కార్మిక రక్షణ లోపాల పల్ల అమెరికా కంపెనీలు నష్టపోతున్నాయని యూఎన్టీఆర్ ఆరోపించింది. ఈ ఏడాది మార్చిలో 16 దేశాలపై ప్రారంభించిన సెక్షన్ 301 దర్యాప్తు అనంతరం ఈ కొత్త సుంకాల ప్రతిపాదనలను ప్రకటించారు. 

ఇతర దేశాలపై 20% నుంచి 35% వరకు టారిఫ్ లు ప్రతిపాదించినప్పటికీ, వాణిజ్య ఒప్పం దాలు ఉన్న భాగస్వామ్య దేశాలకు తక్కువ రేట్లు వర్తిస్తాయని పేర్కొంది. దీని ప్రకారం ఈయూ, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, స్విట్జర్లాండ్ కు సాధారణ సుంకాలతో కలిపి 15 శాతం రేటు వర్తించనుండగా, వాణిజ్య ఒప్పందం ఖరారైతే వియత్నాంకు 20 శాతం సుంకాలు ఉంటాయి.

అమెరికా తయారీ రంగంపై దెబ్బ

దశాబ్దాలుగా పలు వాణిజ్య భాగస్వామ్య దేశాలు వేతనాల నియంత్రణ, ఆర్థిక రాయితీలు, మార్కెట్
విరుద్ధ విధానాల ద్వారా వాణిజ్య సమతుల్యతను తమకు అనుకూలంగా మార్చుకుని అమెరికా తయారీ రంగాన్ని దెబ్బతీస్తున్నాయని యూఎ స్టీఆర్ జేమీసన్ గ్రీర్ విమర్శించారు. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, స్టీల్, ఐసీటీ ఉత్పత్తులరంగాల్లో భారత్ వాణిజ్య మిగులును సాధిస్తోందని, దీనివల్ల కొన్ని కీలక రంగాల్లో భారత తయారీపై అమెరికా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని యూఎస్టీఆర్ తన నివేదికలో పేర్కొంది.

25న పబ్లిక్ హియరింగ్

ఈ ఏడాది మార్చిలో అమెరికా సుప్రీంకోర్టు గతంలో ఐఈఈపీఏ కింద ట్రంప్ ప్రభుత్వం విధించిన విస్తృత సుంకాలను కొట్టివేసిన తర్వాత.. యూఎన్టీఆర్ సెక్షన్ 301 కింద కొత్త దర్యాప్తు లు చేపట్టింది. ప్రస్తుత ప్రతిపాదనలపై జనవరి 5 వరకు రాతపూర్వక అభిప్రాయాలను స్వీకరించి, జనవరి 25న బహిరంగ విచారణ నిర్వహించను న్నట్లు ప్రకటించింది. కాగా, ఈ కొత్త టారిఫ్ లు ఇప్పటికే అమల్లో ఉన్న నిర్బంధ కార్మిక నిరోధక లేదా నిర్దిష్ట రంగాల సుంకాలకు అదనంగా ఉండవని అమెరికా అధికారి ఒకరు తెలిపారు.

అమెరికా నోటీసును పరిశీలిస్తున్నాం: కేంద్రం

న్యూఢిల్లీ: అమెరికా వాణిజ్య కార్యాలయం జారీ చేసిన నోటీసును పరిశీలిస్తున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న భారత్- అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చల్లోనే వాణిజ్య సంబంధిత ఆందోళనలను పరిష్కరించుకోవాలన్నది తమ విధాన మని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఒప్పందాన్నివీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు అమెరికాతో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించింది.