గుడ్ న్యూస్ : త్వరలో 2 వేల హోంగార్డు కొలువులు..డిసెంబర్‌‌‌‌ 6లోపే నోటిఫికేషన్‌‌‌‌కు కసరత్తు

గుడ్ న్యూస్ :  త్వరలో 2 వేల హోంగార్డు కొలువులు..డిసెంబర్‌‌‌‌ 6లోపే నోటిఫికేషన్‌‌‌‌కు కసరత్తు
  • పోలీస్ డిపార్ట్‌‌మెంట్‌‌లో దాదాపు 
  •     టీజీ మార్స్‌‌‌‌ అవసరాలకు అనుగుణంగా నియామకాలు
  •     జిల్లాల వారీగా ఖాళీల గుర్తింపు
  •     టెన్త్​/ ఇంటర్‌‌‌‌ అర్హతతో ఉద్యోగాలు
  •     డిసెంబర్‌‌‌‌ 6లోపేనోటిఫికేషన్‌‌‌‌కు కసరత్తు

 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పోలీస్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో కొత్త హోంగార్డుల నియామకాలకు రంగం సిద్ధం అయ్యింది. దాదాపు 2 వేల పోస్టులను భర్తీ చేసేందుకు డీజీపీ కార్యాలయం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం విధుల్లో ఉన్న హోంగార్డులతో పాటు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ సహా అన్ని విభాగాల్లోకి ఎంత మంది అవసరం అవుతారనే వివరాలు సేకరిస్తోంది. కొత్తగా రిక్రూట్‌‌‌‌ చేసుకునే హోంగార్డులను తెలంగాణ ట్రాఫిక్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌, రోడ్‌‌‌‌ అండ్‌‌‌‌ రైల్‌‌‌‌ సేఫ్టీ బ్యూరో (టీజీ-మార్స్‌‌‌‌) అవసరాల కోసం నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ ఇటీవలే హోంగార్డుల ప్రక్రియపై మినీ స్టాఫ్ ఆఫీసర్లతో సమీక్ష జరిపిన సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు నియామకాలకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.

రైజింగ్‌‌‌‌ డే కు ముందే!

డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 6న హోంగార్డు రైజింగ్‌‌‌‌ డే సందర్భంగా నియామక నోటిఫికేషన్‌‌‌‌ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నియామకాలకు సంబంధించి ఇతర విధివిధానాలపైనా చర్చించినట్టు తెలిసింది. కనీస విద్యార్హత  పదో తరగతి లేదా ఇంటర్మీడియట్‌‌‌‌ ప్రాతిపదికగాన నియామకాలు చేపట్టే అవకాశాలున్నాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ట్రాఫిక్, లా అండ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌లో విధులు నిర్వహించాల్సి ఉండటంతో అభ్యర్థుల శారీరక సామర్థ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీలను గుర్తించి స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చే అంశాలను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, యూనిఫాం సర్వీసెస్‌‌‌‌ కావడంతో హోంగార్డుల నియామకాల్లో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఎంపిక చేసే దిశగా డీజీపీ కార్యాలయం ఏర్పాట్లు చేస్తున్నది.