తిరుచిరాపల్లి: తమిళనాడు తిరుచిరాపల్లిలోని రాక్‌ఫోర్ట్ ఉచ్చి పిళ్లయార్ ఆలయంలో 'కార్తిగై మహా దీపం' వెలిగింది. రాతి స్తంభంపై వెలిగించకపోవడం గమనార్హం. ఉచ్చి పిళ్లయార్ ఆలయం దీప మండపంలోనే ఈసారి కూడా కార్తీక దీపం వెలిగించారు. తాయుమనవర్, మట్టువర్ కుళల్ అమ్మన్‌లతో కూడిన పంచమూర్తుల ఊరేగింపు జరిగింది.
ఈ సందర్భంగా సాంప్రదాయ కొంబు (వాద్యం), శివ వాద్యాల ధ్వనులు మార్మోగాయి. 273 అడుగుల ఎత్తులో, 417 మెట్లు కలిగిన రాక్‌ఫోర్ట్‌లోని తాయుమనవర్ సన్నిధి, ఉచ్చి పిళ్లయార్ ఆలయం ముందు ఉన్న ఎత్తైన గోపురంపై ఏర్పాటు చేసిన భారీ పాత్రలో, బాణసంచా వెలుగుల మధ్య సరిగ్గా మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఈ మహా దీపాన్ని వెలిగించారు.
#WATCH | Tamil Nadu | The grand Karthigai Maha Deepam was lit at the Rockfort Ucchi Pillayar Temple in Tiruchirappalli. The sacred flame was then carried in a procession along with the Panchamoorthis, including Thayumanavar and Mattuvar Kuzhal Amman, accompanied by the sounds of traditional Kombu and Shiva musical instruments. The grand Maha Deepam was lit at exactly 6 pm, amid fireworks, in a massive cauldron installed atop a tall tower in front of the Thayumanavar shrine and Ucchi Pillayar Temple at the 273-foot-high Rockfort, which has 417 steps. Around 700 litres of iluppai oil, sesame oil and ghee were poured into the massive cauldron, and a giant wick made of cotton cloth, measuring approximately 300 metres, was used to light the Maha Deepam. The Maha Deepam, lit this evening, is set to burn continuously for three days.
— ANI (@ANI) November 24, 2026
ఈ భారీ పాత్రలో సుమారు 700 లీటర్ల ఇప్ప నూనె, నువ్వుల నూనె, నెయ్యిని పోశారు. సుమారు 300 మీటర్ల పొడవైన, పత్తి వస్త్రంతో చేసిన భారీ వత్తిని ఉపయోగించి ఈ మహా దీపాన్ని వెలిగించారు. ఈ సాయంత్రం వెలిగించిన ఈ మహా దీపం, వరుసగా మూడు రోజుల పాటు నిరంతరాయంగా వెలుగుతూనే ఉంటుంది.
తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై నవంబర్ 24న కార్తీక దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వెసులుబాటును కేవలం ఈ ఒక్కసారికి మాత్రమే పరిమితం చేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం.పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీపం వెలిగించేందుకు కేవలం దేవస్థానం తరఫున అధికారం పొందిన వ్యక్తులు, ప్రభుత్వ అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అవసరమైతే అక్కడ తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.
మధురైలోని అరుళ్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయానికి చెందిన ఈ కొండపై కార్తీక దీపాన్ని ఎక్కడ, ఎవరు వెలిగించాలనే అంశంపై కొంతకాలంగా వివాదం నెలకొంది. దశాబ్దాలుగా కొండ దిగువ భాగంలోని ఉచ్చిపిళ్లయార్ ఆలయానికి సమీపంలో ఉన్న దీప మండపం వద్ద ఈ దీపాన్ని వెలిగిస్తున్నారు. అయితే, కొండపై భాగంలో ఉన్న హజ్రత్ సుల్తాన్ సికందర్ బాదుషా ఔలియా దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న పురాతన రాతి దీప స్తంభం వద్ద దీపం వెలిగించేందుకు అనుమతించాలని హిందూ సంఘాలు కోరిన సంగతి తెలిసిందే.
దర్గాకు సమీపంలో ఉన్న రాతి స్తంభంపై సంప్రదాయ కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతినిస్తే, దేశవ్యాప్తంగా ఉన్న వేలాది సర్వే స్తంభాలకు మతపరమైన గుర్తింపు వచ్చే ప్రమాదం ఉందని తమిళనాడు ప్రభుత్వం వాదించింది. ఈ క్రమంలో.. దీప మండపంలోనే కార్తీక దీపం వెలిగించారు.
