వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ‘మహాత్మా గాంధీ’ పేరు

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ‘మహాత్మా గాంధీ’ పేరు

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్‌‌లో నిర్మాణంలో ఉన్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ‘మహాత్మా గాంధీ మెమోరియల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి’గా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

గతంలో ఈ ఆస్పత్రి స్థాపన, నిర్మాణానికి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా సమీక్షించిన ప్రభుత్వం ఈ మేరకు నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరఫున ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తు జీఓ ఎంఎస్ నంబర్ 180 ద్వారా ఈ ఉత్తర్వులను వెలువరించారు. 

దీనికి సంబంధించి తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌‌లోని వైద్య విద్యా సంచాలకులతో (డీఎంఈ) పాటు వరంగల్ కలెక్టర్‌‌ను ప్రభుత్వం ఆదేశించింది.