యూకే వెళ్లకుండా అడ్డుకున్నారు!..ఆక్స్‌‌‌‌ఫర్డ్ చర్చకు వెళ్లనివ్వలేదు: సౌరవ్ దాస్

యూకే వెళ్లకుండా అడ్డుకున్నారు!..ఆక్స్‌‌‌‌ఫర్డ్ చర్చకు వెళ్లనివ్వలేదు: సౌరవ్ దాస్

న్యూఢిల్లీ: యూకే పర్యటనకు వెళ్లకుండా తనను అడ్డుకున్నారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సహ వ్యవస్థాపకుడు సౌరవ్ దాస్ ఆరోపించారు. సోమవారం తెల్లవారుజామున లండన్ వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌‌‌‌పోర్టుకు చేరుకోగా.. ఇమ్మిగ్రేషన్ అధికారులు పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌ను ఫ్లాగ్ చేసి ఆపేశారని 'ఎక్స్‌‌‌‌'లో వెల్లడించారు. ఆక్స్‌‌‌‌ఫర్డ్ స్టూడెంట్ యూనియన్‌‌‌‌లో ‘కాక్రోచ్ మూవ్ మెంట్’ జరిగే చర్చలో పాల్గొనేందుకు వెళ్తుండగా మోదీ ప్రభుత్వం అడ్డుకుందని మండిపడ్డారు.

విద్యావంతుల మధ్య చర్చకు వెళ్లే యువకుడిని అడ్డుకోవడం మేధో వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. 'నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలా బ్యాంకుల నుంచి వేల కోట్లు దోచుకుని ఉంటే బాగుండేది' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ అడ్డంకులతో తన ప్రయాణం ఆగదని, భవిష్యత్తులో లండన్, పారిస్‌‌‌‌కు వెళ్తానని స్పష్టం చేశారు. మరోవైపు, సౌరవ్‌‌‌‌కు ఆక్స్‌‌‌‌ఫర్డ్ నుంచి ఆహ్వానం రావడం అధికారంలో ఉన్న ఓ వ్యక్తికి అసూయ కలిగించిందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విమర్శించారు.