నవంబర్ 26 న రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ

నవంబర్ 26 న రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ
  • పీసీసీ ఆధ్వర్యంలో లిబర్టీ నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన

హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 26వ తేదీన పీసీసీ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షా మార్చ్’ నిర్వహించనున్నారు. ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌లోని అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్‌‌‌‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు ఈ భారీ ప్రదర్శన సాగనుంది.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌‌‌‌చార్జ్ బీఎం సందీప్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌‌‌‌ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజాస్వామ్య వాదులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ మార్చ్‌‌‌‌ను విజయవంతం చేయాలని పీసీసీ పిలుపునిచ్చింది.