రెండేండ్లకు సరిపడా సన్నబియ్యం..కరువొచ్చినా ఢోకా లేకుండా గోదాముల్లో నిల్వలు: సీఎం రేవంత్

రెండేండ్లకు సరిపడా సన్నబియ్యం..కరువొచ్చినా ఢోకా లేకుండా గోదాముల్లో నిల్వలు: సీఎం రేవంత్
  •    పల్లెల్లో పౌల్ట్రీ ఫారాలకు సింగిల్ విండో అనుమతులు
  •     దాణాకు ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐ బఫర్ స్టాక్ నుంచి మద్దతు ధరకు మక్కలు
  •     ఫ్యూచర్ సిటీలో పౌల్ట్రీ కన్వెన్షన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భూమి
  •     హైటెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో ప్రారంభం

హైదరాబాద్, వెలుగు:ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో కరువు వచ్చినా రాష్ట్రంలో తిండి గింజలకు ఢోకా లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాబోయే రెండేండ్లకు సరిపడా నాణ్యమైన సన్నబియ్యం పౌరసరఫరాల శాఖ, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐ గోదాముల్లో సిద్ధంగా ఉందని, ఎంత తీవ్ర కరువు వచ్చినా ప్రజలకు తిండి గింజల కొరత గానీ, తాగునీటి తిప్పలు గానీ ఉండవని భరోసా ఇచ్చారు. 

బుధవారం మాదాపూర్ హైటెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ‘పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో–2026’కు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పౌల్ట్రీ పరిశ్రమ విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఈ రంగానికి ప్రత్యేక పారిశ్రామిక పాలసీ తెస్తామని హామీ ఇచ్చారు.

గ్రామాల్లో పౌల్ట్రీ ఫారాలు పెట్టుకునే రైతులకు అనుమతులు, భూ మార్పిడి (ల్యాండ్ కన్వర్షన్) విషయంలో పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, త్వరలోనే దీనికి శాశ్వత పరిష్కారం చూపుతామని సీఎం రేవంత్ చెప్పారు. 

పట్టణాల్లో భవన నిర్మాణాలకు ‘బిల్డ్ నౌ, టీజీ–బీపాస్’ ద్వారా సింగిల్ విండోలో అనుమతులు ఇస్తున్నట్లే, ఆ విధానాన్ని గ్రామ పంచాయతీలకూ విస్తరిస్తామన్నారు. అలసత్వం, అవినీతికి తావులేకుండా, నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసిన రైతులకు వెంటనే పౌల్ట్రీ షెడ్లు, ఫారాలకు క్లియరెన్స్ ఇచ్చేలా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు. 

రాష్ట్రంలో రోజుకు 5.30 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని, పౌల్ట్రీని ఐటీ, ఫార్మా, డిఫెన్స్ తరహాలో ప్రాధాన్య రంగంగా గుర్తించామని చెప్పారు. సర్కారు బడులు, సంక్షేమ హాస్టళ్లలో పేద విద్యార్థులకు వారానికి మూడు గుడ్లు, చికెన్ భోజనం అందించడంలో పౌల్ట్రీ రంగం 
భాగస్వామ్యం వెలకట్టలేనిదన్నారు.

దాణా కొరత రాకుండా చర్యలు

కోళ్ల దాణాకు కావాల్సిన మక్కలు, సోయాబీన్ కొరతతో పౌల్ట్రీ రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ మంత్రి, పశుసంవర్ధక శాఖ మంత్రి తక్షణమే రంగంలోకి దిగాలని సీఎం ఆదేశించారు. 48 గంటల్లో పౌల్ట్రీ సంఘాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి, సివిల్ సప్లయ్స్, ఎఫ్‌సీఐ బఫర్ స్టాక్ నుంచి నేరుగా పౌల్ట్రీ రైతులకు కనీస మద్దతు ధరకు మక్కలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 మంత్రి శ్రీహరి ద్వారా ప్రతిపాదనలు ఇస్తే, డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’లో ఫ్యూచర్ సిటీలో పౌల్ట్రీ కన్వెన్షన్ సెంటర్‌కు భూ కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. 30 ఏండ్లలో ఏ ప్రభుత్వం వచ్చినా పారిశ్రామిక విధానాలను రద్దు చేయలేదని, తెలంగాణలో ‘పాలసీ పెరాలసిస్’ ఉండదని ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు.

నేను ‘చికెన్ మంత్రిని’: వాకిటి శ్రీహరి

కోడిగుడ్డులోని ప్రొటీన్ 90 శాతం సులభంగా జీర్ణమవుతుందని, పేదలకు అత్యంత చౌకైన, ఆరోగ్యకరమైన ప్రొటీన్ చికెన్, గుడ్డేనని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ భూమి మీద కల్తీ లేనివి రెండే రెండు అని, అందులో ఒకటి తల్లిపాలు కాగా, రెండోది కోడిగుడ్డు మాత్రమేనన్నారు. 

కోడిగుడ్డు ద్వారా 90 శాతం సులభంగా జీర్ణమయ్యే అత్యుత్తమ రోగనిరోధక శక్తి లభిస్తుందని, కరోనా మహమ్మారి సమయంలో గుడ్డు, చికెన్ తిన్నవారే ప్రాణాలు కాపాడుకోగలిగారని గుర్తుచేశారు. పేదలకు అత్యంత చౌకైన, ఆరోగ్యకరమైన ప్రోటీన్ అందించేది చికెన్ మాత్రమేనని వివరించారు. 

 సీఎం తనను చికెన్ మంత్రిని చేయడమే కాకుండా మటన్, చేపల బాధ్యతలు కూడా అప్పగించారని చమత్కరించారు. మార్కెట్‌లో ధరలు హెచ్చుతగ్గులకు లోనైనా గ్రామీణ పౌల్ట్రీ రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని రకాల రాయితీలతో అండగా ఉంటుందన్నారు.