తెలంగాణ నీళ్లపై బాబు కుట్ర.. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ పనులు రయ్.. రయ్

తెలంగాణ నీళ్లపై బాబు కుట్ర.. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ పనులు రయ్.. రయ్

 

  • ఇప్పటికే పోతిరెడ్డి పాడు ద్వారా శ్రీశైలం అడుగుకు చిల్లు
  • ఇప్పుడు పల్నాడు ప్రాజెక్ట్ పేరుతో సాగర్ డెడ్ స్టోరేజీకి గండి
  • గోదావరిలో మిగులు జలాలు లేకున్నా బనకచర్ల సహా కొత్త ప్రాజెక్టులు
  • బాబు హయాంలోనే నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టుతో ఇప్పటికే 500 టీఎంసీల గోదావరి నీళ్ల మళ్లింపు
  • అదే సమయంలో మన ప్రాజెక్టులకు పర్మిషన్లు రాకుండా అడ్డుపుల్లలు
  • 'పాలమూరు-రంగారెడ్డి' ఆపాలని కేంద్రానికి తొలి లేఖ రాసిందీ బాబే
  • ఎల్​ నినో కరువుతో తెలంగాణలో ముంచుకొస్తున్న తాగునీటి గండం
  • ఉన్న కొద్ది నీళ్లకూ బాబు ఎసరు పెట్టడంపై భగ్గుమంటున్న తెలంగాణ

పట్టిసీమతో 500 టీఎంసీలు

ఏపీ చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం కూడా చంద్రబాబు హయాంలోనిదే! ఏటా 80 టీఎంసీలు తరలించేలా దానిని నిర్మించారు. ఒక్కోసారి పీక్స్​ లో వంద టీఎంసీలను తరలిస్తున్నారు. డెల్టా సిస్టమ్ కు నీటిని తరలించేలా నిర్మించిన ఈ లిఫ్ట్ స్కీమ్ ఉండగానే.. సాగర్ నుంచి డెల్టా సిస్టమ్​ కు  తాగునీటి అవసరాలకంటూ చంద్రబాబు ప్రభుత్వం సాగర్ లో మరో కుట్రకు తెరలేపిందన్న విమర్శలున్నాయి. పట్టిసీమ లిఫ్ట్ ప్రారంభమైన 2015 నుంచి ఇప్పటి వరకు 500 టీఎంసీలు తరలించినట్టు ఏపీ ప్రభుత్వ పెద్దలే చెప్పడం గమనార్హం.

హైదరాబాద్ వెలుగు: రాష్ట్రం విడిపోయి పన్నెండేండ్లయినా తెలంగాణపై చంద్రబాబు కుట్రలు ఇంకా ఆగడం లేదు. కృష్ణ, గోదా వరి నదీ జలాలను అడ్డూ అదుపులేకుండా ఏపీకి తరలించుకు పోతుండటంతో తెలంగాణ నీటి కోసం తల్లడిల్లుతోంది. 

ఎల్​నినోతో కరువొచ్చి చుక్కనీటికీ జనం అరిగోసపడ్తుంటే, మరోదిక్కు కనీస కనికరం లేకుండా సాగర్​ కు గండికొట్టడంపై తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఏపీసీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ కు కొత్తగా ఎలాంటి ప్రాజెక్టూ ఇవ్వకుండా గోసపుచ్చుకున్న బాబు, రాష్ట్రం విడిపోయాక సైతం నీడలా వెంటాడుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు రూపంలో శ్రీశైలానికి పొక్కకొట్టిన ఏపీ.. కృష్ణా డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తోడుకుంటున్న సంగతి తెలిసిందే! 

ఇది చాలదన్నట్లు ఇప్పుడు బాబు నేరుగా సాగర్ డెడ్ స్టోరేజ్ కీ గురిపెట్టాడు. పల్నాడు వాటర్
గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా సాగర్ లో 510 అడుగుల కన్నాదిగువ నుంచి నీటిని ఖాళీ చేసేలా పనులు చేస్తున్నాడు. ఇది పూర్తయితే కరువు పూట హైదరాబాద్​ కు  తాగునీటి గండం తప్పదు. మరోవైపు కేంద్రంలో భాగస్వామ్యాన్ని అడ్డుపెట్టుకొని బసకచర్ల ప్రాజెక్ట్ కు అనుమతులు తెచ్చుకునేందుకు బాబు చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్నీకావు ఇందుకోసం తెలంగాణాలోని ఇచ్చంపల్లి నుంచి తలపై ట్టిన గోదావరి - కావేరీ లింకు సోర్సు పాయింట్​ ను  సైతం మార్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. 

ఇదిచాలదన్నట్లు పాలమూరురంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ సాగర్ సహా వివిధ ప్రాజెక్టులకు అనుమతులు రాకుండా కేంద్రానికి లేఖల మీద లేఖలు రాస్తున్న చంద్రబాబు.. నాటి నుంచి నేటివరకు తెలంగాణ జల ప్రయోజ నాలకు గండికొడ్తూనే ఉన్నాడు.

నాగార్జునసాగర్ రిజర్వాయర్ కుడివైపున ఏపీ భూ భాగంలోని విజయపురి సౌత్ సమీపంలో 'పల్నాడు. వాటర్ గ్రిడ్' పేరుతో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. సుమారు రూ.1,200 కోట్ల వ్యయంతో 1.865 టీఎంసీలు తరలించేలా చేపట్టిన ఈ పథకం ద్వారా 510 అడుగుల స్థాయిలో అంటే కనిష్ట నీటిమట్టం దాదాపు 155.45 మీటర్లకు దిగువన సుమారు 150 మీటర్ల వద్ద మూడు ఇన్​ టేక్ వెల్స్, సొరంగం, దాదాపు 1,650 కిలోమీటర్ల పైప్​ లైన్​ నెట్​ వర్క్ నిర్మిస్తున్నది. 

వాస్తవానికి ఈ ప్రా జెక్టుకు గతేడాదే చంద్రబాబు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. 2025 మేలోనే ప్రకాశం. .ధవళేశ్వరం బ్యారేజీల నుంచి తాగునీటి అవసరాల కోసం వివిధ ప్రాజెక్టులను జల్ జీవన్ మిషన్ కింద చేపడుతున్న ట్టు జీవో విడుదల చేసింది. దానికి కొనసాగింపుగానే ఈ ఏడాది ఆగస్టులో పల్నాడు వాటర్ గ్రిడ్ కు జీవో ఇచ్చింది. జీవో ఈ ఏడాది ఇచ్చినా.. పనులు మాత్రం అంతకు ముందే ప్రారంభించారన్న వాదనలూ ఉన్నాయి. 

మన ఆధీనంలో ఉండాల్సిన సాగర్ ప్రా జెక్టు ఇప్పటికే సగం చేజారిపోయింది. కుడివైపు భాగంలో ఏపీ ఏం చేస్తోందన్నదానిపై నిఘా పెట్టాల్సి ఉన్నా మన ప్రభుత్వం, అధికారులు ఆ పని చెయ్యలే దు. మనకు ఈ విషయం తెలిసేలోపే ఏపీ ప్రభుత్వం 150 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసేసింది. తీరా కేంద్రానికి, కృష్ణా బోర్డుకు, ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ అభ్యంతరం తెలిపినప్పటికీ పక్క రాష్ట్రం మాత్రం ఎప్పట్లాగే పనులను కొనసాగిస్తున్నది.

శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ పనులూ రయ్.. రయ్

శ్రీశైలం నీళ్లను రాయలసీమ ప్రాంతానికి తరలించే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ (ఎస్ ఆర్ఎంసీ) కి లైనింగ్ పనులనూ చంద్రబాబు ప్రభుత్వం వేగవంతం చేసింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు 16.4 కిలో మీటర్ల పొడవున్న ఈ ఎస్ఆర్ఎంసీ లైనింగ్ పనులు ఇప్పటికే దాదాపు పూర్తికావచ్చాయి. 

సైడ్ లైనింగ్ 13 కిలోమీటర్లు పూర్తవ్వగా.. బెడ్ లైనింగ్ (అడుగు భాగం) 10 కిలోమీటర్లు పూర్తయినట్టు అధికార వర్గాలే చెబుతున్నాయి. ప్రస్తుతం చిన్నచిన్న రిపేర్లు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరో రెండు రోజుల్లో లైనింగ్ పనులను పున:ప్రా రంభించనున్నట్టు సమాచారం. 

మరో సైడ్ లైనింగ్ పనులు 3.4 కిలోమీటర్లు మాత్రమే ఉండడంతో. ఈ సీజన్లోనే పూర్తి చేయాలని అధికారులకు చం ద్రబాబు ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. అంటే 2027 వర్షాకాలం ప్రారంభం నాటికి ఎస్ఆర్ఎంసీ లైనింగ్ ను పూర్తి చేసి శ్రీశైలం నుంచి రోజూ 8 టీఎంసీలనీటిని మళ్లించుకునేందుకు శరవేగంగా దంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.

మనప్రాజెక్టులకు మోకాలడ్డు... 

అనేక అక్రమ ప్రాజెక్టులు చేపడుతున్న చంద్రబాబు సర్కార్ తెలంగాణ ప్రాజెక్టులకు సూత్రం అడుగడు గునా మోకాలడ్డుతోంది కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి సహా పలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు 2015 నుంచి 2026 వరకు చంద్రబాబు ఎన్నో లేఖలు రాశారు. 

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకో వాలంటూ 2015 జులైలో అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతికి బాబు లేఖ రాశారు. మన ప్రాజెక్టులను అడ్డుకోవడానికి పడిన మొదటి అడుగు చంద్రబాబుదే కావడం గమనార్హం కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూ సీ అనుమతులను వృతిరేకిస్తూ చంద్రబాబు 2018 జూన్ 13న కేంద్రానికి అధికారికంగా లేఖ రాశారు. 

ఇది పునర్విభజన చట్టానికి విరుద్ధమని, సీడబ్ల్యూసీ అనుమతులను సమీక్షించాలని కోరుతూ అప్పట్లో ఏపీ ప్రభుత్వం దాదాపు 8 లేఖలు రాశారు. పాలమూరు రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, కాళేశ్వరం ప్రాజెక్టులను ఆపాలని డిమాండ్ చేస్తూ 2014 నుంచి 2018 వరకు చంద్రబాబే మొత్తం 30 లేఖలు రాశారన్న ఆరోపణలూ ఉన్నాయి. 

చంద్రబాబు పెట్టిన మెలికలతోనే 2024 డిసెంబర్లో పాలమూరు రంగారెడ్డి, వార్దా, కాళేశ్వ రం థర్డ్ టీఎంసీల డీపీఆర్లు వెనక్కు వచ్చాయన్న విమర్శలూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం 42 అక్రమ ప్రాజెక్టులను చేపట్టిందంటూ 2025 డిసెంబర్ లో చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖల ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో కాళేశ్వరం,  చౌటుపల్లి హన్మంతరావు, చిన్న కాళేశ్వరం, చనాక కొరాట, మోదికుంట వాగు, కడెం గూడెం, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులను ఆపాలని, సమ్మక్క బ్యారేజీ అనుమతులు రద్దు చేయాలని కోరుతూ జీఆర్ఎంబీ మీటింగ్ ఎజెండా పంపించారు. 

గోదావరి బోర్డు మీటింగ్ ఎజెండాలోనూ చేర్చడం గమనార్హం. ఆ తర్వాత కొన్ని నెలలకే కేంద్ర ప్రభుత్వం సమ్మక్కసా గర్ డీపీఆరూ వెనక్కు పంపించింది చంద్ర బాబు కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

 బనకచర్ల అని ఒకసారి..నల్లమలసాగర్ అని మరోసారి...

గోదావరిలో మిగులు జలాలుగానీ.. వరద జలాలు గానీ లేవని ఇప్పటికీ సెంట్రల్ వాటర్ కమిషన్ (సీ డబ్ల్యూసీ) ఎన్నో సందర్భాల్లో చెప్పింది. అసలు వాటి టెక్కే తేలలేదని స్పష్టం చేసింది. కానీ, ఆ లెక్కలేవీ తేలకుండానే బనకచర్ల ప్రాజెక్టును కట్టేందుకు చం ద్రబాబు రెడీ అయ్యారు. 

2024లోనే దాని డిజైన్లు కూడా ఖరారుచేశారు. పోలవరం కుడి కాల్వ ద్వారా రోజూ 2 టీఎంసీల చొప్పున వంద రోజుల్లో 200 టీఎంసీల నీటిని ఎత్తిపోసి టన్నెళ్లు, కాల్వల ద్వారా 400 కిలోమీటర్ల దూరం లోని చన క్రాస్​ రెగ్యులేటర్​ కు తరలించాలన్నది ఆయన వ్యూహం. అందుకు మధ్యలో సాగర్​ నూ వాడేసుకున్నారు. 

కుడికాల్వ దగ్గర కెనాల్​  వెడల్పు చేయడం. అక్కడ ఆక్విడక్ట్ ను నిర్మించడం అక్కడి నుంచి 150 టీఎంసీల సా మర్ద్యంతో నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్ కు తర లించడం ప్లాన్లోభాగం. ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు తలచుకున్న అంచనా వ్యయం రూ.81,900 కోట్లు. ఈ నిధుల కోసం ప్రత్యేకంగా జలహారతి అనే కార్పొ రేషన్​ ను నిరుడు ఏర్పాటు చేశారు. 

కానీ తెలంగాణ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడం పర్యావరణ శాఖ నుంచి క్లియరెన్సులు రాకపోవడంతో మళ్లీ దానిని పోలవరం నల్లమలసాగర్ అని రూటుమా ర్చేశారు. రూటు మారిందే తప్పు నీటి దోపిడీ ప్లాన్ లో ఎలాంటి మార్పూ లేదు. ఇక్కడితో ఆగిపోలేదు. తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టేలా బాబు మరో ఎత్తుగడ వేశారు. 

ముందుగా అనుకున్న ఇచ్చం పల్లి లేదా సమ్మక్క సాగరక్కు బడులు ఇప్పటికే రెడీగా ఉన్న పోలవరం నుంచే గోదావరి కావేరి లింక్ను చేపట్టాలని కేంద్రం ముందు ప్రతిపాదించారు. ప్రతి మీటింగ్ లోనూ పోలవరం బనకచర్లపై ప్రకటనలు చేస్తున్నారు. నిరుడు మేలో మహానాడు. ఆగస్టు 15, ఈ ఏడాది జనవరి 5న జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు, ఇటీవల జరిగిన సీఐఐ సదస్సులోనూ పోలవరం, బనకచర్ల ప్రాజెక్టు కట్టితీరుతామంటూ స్టేట్ మెంట్లు ఇచ్చారు.

 కూటమిలో భాగస్వామిగా ఉన్న అవకాశాన్ని అలుసుగా తీసుకొని ఈ ఏడాది వరుసగా కేంద్ర మంత్రులు, ప్రధానిని కలుస్తూ ఆ ప్రాజెక్టును ముందుకు తీసు కెళ్లేందుకు చంద్రబాబు. చేయని ప్రయత్నం లేదు..

డెడ్ స్టోరేజ్ పైనా కన్ను

చంద్రబాబు ప్రభుత్వం జలదోపిడీ.. డెడ్ స్టోరేజ్ నే ఖాళీ చేసేంతలా ఉందంటే అతిశయోక్తి కాదేమో. శ్రీశైలం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కు గండిపెట్టేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు సాగర్ డెడ్ స్టోరేజ్ పైనా గురిపెట్టింది. పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ స్వరూపమే అందుకు నిదర్శనం. ఇక, తాజాగా జరిగిన కృష్ణా బోర్డు త్రీమెంబర్ కమిటీ మీటింగ్ లోనూ డెడ్ స్టోరేజ్ పైనే ఏపీ ఈ ఎన్సీన్సే మాట్లాడడం ఏపీ డెడ్ స్టోరేజ్ కుట్రలకు మరింత బలం చేకూరుస్తున్నది. 

వాస్తవానికి ప్రాజెక్టుల డెడ్ స్టోరేజ్ కు  అత్యవసర పరిస్థితుల్లోనే వాడుకోవాల్సి ఉంటుంది. కానీ, అలాంటి పరిస్థితేమీ లేకుండానే ఏపీ ఈఎన్ సీ డెడ్ స్టోరేజ్ నీళ్లను వాడేద్దామని ఉచిత సలహాలిచ్చారు. సాగర్ ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ లెవెల్ 510 అడుగులు అయితే.. ఏకంగా 490 అడుగుల వరకు వెళ్లి నీటిని పంచుకుందామంటూ ప్రతిపాదన పెట్టారు. అంటే ఏపీ ప్రభుత్వం జలచోరికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదలడం లేదని స్పష్టమవుతున్నది.

జల్​ జీవన్​ మిషన్​ పేరిట దొడ్డిదారిన జీవోలు

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'రివ్యాంప్డ్ జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం తమఅక్రమ నీటి కేటాయింపులకు రాజమార్గం గా మార్చుకుంది. 2025 మే నుంచి 2026 ఆగస్టు మధ్య ఏపీ జలవనరుల శాఖ వరుసగా నాలుగు జీవోలను జారీ చేసి, రాష్ట్రంలోని రూరల్ వాటర్ సప్లై స్కీం శాఖకు సొంతంగా నీటిని కేటాయించేసు కుంది. 

2025 మే 13న ఇచ్చిన ఒక్క జీవోతోనే 8 సోర్సుల నుంచి 13.538 టీఎంసీల నీటి తరలింపునకు ప్లాన్​ చేసింది. ప్రకాశం బ్యారేజ్​ నుంచి 4.489 టీఎంసీలు, ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 4.062 టీఎంసీలు, ఏలేరు రిజర్వాయర్ నుంచి 2.003 టీఎంసీలు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా 1,475 టీఎంసీలు, పులికనుమ రిజర్వాయ 5 లో 0.583 టీఎంసీలు, వెలిగల్లు రిజర్వాయర్ నుంచి 0.327 టీఎంసీలు, వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 0,300 టీఎంసీలు, ఆవుకు రి జర్వాయర్ ద్వారా 0.299 టీఎంసీలు తరలించేలా జీవోలు జారీ చేసింది. ఇ

క 2025 నవంబర్ 24న కూడా మరో జీవో ఇచ్చింది. గండికోట రిజర్వాయర్ నుంచి 3.378 టీఎంసీల నీటి తరలింపునకు పచ్చ జెండా ఊపింది. లోటు సమయాలోనూ ఇందులో నుంచి సొంత ఏర్పాట్లు చేసుకోవాలంటూ రూరల్ వాటర్ సప్లైకి సూచించింది. 

ఈ ఏడాది ఏప్రిల్ 16న ఇచ్చిన జీవో ప్రకారం వెలిగొండ రిజర్వాయర్ (నల్లమల సాగర్ రిజర్వాయర్) నుంచి ప్రాజెక్టు కమిష నింగ్ తర్వాత 1.737 టీఎంసీలు తీసుకునేలా ఆనుమతులు జారీ చేసింది. తాజాగా ఆగస్టులో ఇచ్చిన జీవోతో సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి 1,865 టీఎంసీల తరలింపులకు జీవో జారీ చేసింది. మొత్తంగా ఇవన్నీ కలిపితే 20:518 టీఎంసీల నీటిని ఏపీతన ప్రాంతా నికి తరలించేసుకోనుంది