అక్కినేని నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ వృషకర్మ ట్రైలర్ వాయిదా పడింది. పలు సాంకేతిక కారణాల రీత్యా ట్రైలర్ ను 2026 నవంబర్ 26కు వాయిదావేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. గురువారం ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ఎస్వీసీసీ ప్రకటించింది.
మిస్టరీ, మైథాలజీ, అడ్వెంచర్ లాంటి అంశాలతో వస్తున్న వృషకర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. విరూపాక్షతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మించారు.
నాగచైతన్యకు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా.. స్పర్శ శ్రీవాస్తవ, జయరామ్, కియారా ఖన్నా తదితరులు కీలక పాత్రలో నటించారు. డిసెంబరర్ 4న సినిమా రిలీజ్ కానుంది.
