కలియుగ వైకుంఠం తిరుమలలో నవంబర్ 29న కార్తీక వాన భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపింది టీటీడీ. తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేట మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది టీటీడీ. ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజవాహనంపై, ఉభయనాంచారులు పల్లకిపై ఆలయంనుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేటమండపానికి వేంచేపు చేస్తారని తెలిపింది టీటీడీ.
ఉదయం 11 నుండి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం, అనంతరం మధ్యాహ్నం 1 నుండి 2 గంటల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది టీటీడీ.
ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది టీటీడీ.
