కేసు విచారణల రికార్డింగ్, లైవ్ టెలికాస్ట్ పై నిషేధం.. ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం...

కేసు విచారణల రికార్డింగ్, లైవ్ టెలికాస్ట్ పై నిషేధం.. ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం...

కోర్టులో జరిగే విచారణల రికార్డింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ హైకోర్టు. కోర్టులో జరిగే విచారణను రికార్డ్ చేయడం, టెలికాస్ట్ చేయడంపై నిషేధం విధించింది ఏపీ హైకోర్టు. ముందస్తు అనుమతి లేకుండా విచారణకు సంబంధించి వీడియోలు, ఆడియోలు రికార్డ్ చేయడం, ఫోటోలు, స్క్రీన్ షాట్స్ వంటివి తీయడంపై నిషేధం విధించినట్లు తెలిపింది కోర్టు.

అంతే కాకుండా కోర్టు విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేయడం, విచారణకు సంబంధించిన క్లిప్పింగ్స్ అప్ లోడ్ చేయడం నేరంగా పరిగణించనున్నట్లుస్పష్టం చేసింది హైకోర్టు. టీవీ చానళ్ళు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, వెబ్ సైట్స్ లో అప్ లోడ్ చేయడం, యాప్స్ లో ప్రసారం చేయడం కూడా నిషేధించినట్లు తెలిపింది ఏపీ హైకోర్టు.

ఈ మార్గదర్శకాలు ప్రతి ఒక్కరు పాటించాలని సూచించింది. ఈమేరకు న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు, కక్షిదారులు, కోర్టు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా రికార్డింగ్ కానీ,టెలికాస్ట్ కానీ చేసినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది కోర్టు.