ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు నాలుగు నెలల తర్వాత జరగనున్న ఈ సమావేశాల్లో పెట్టుబడుల రక్షణ చట్టానికి సంబంధించిన కీలక బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు రాజకీయ మార్పులతో సంబంధం లేకుండా రక్షణ కల్పించడమే ఈ చట్టం లక్ష్యమని తెలుస్తోంది.
పరిశ్రమలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, భూముల కేటాయింపుల విషయంలో చట్టపరమైన భరోసా కల్పించేలా బిల్లును రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టు పురోగతిపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ పనులు, పురోగతి, భవిష్యత్ కార్యాచరణ వంటి కీలక అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపైనా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితి, పురోగతి, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. దేశంలోనే తొలిసారిగా పరిశ్రమల పెట్టుబడుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టనున్నామని ఇదివరకే ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఇ
టీవల విశాఖలో జరిగిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెడ తారా అన్నది ఆసక్తిగా మారింది.
