మైహర్: మధ్యప్రదేశ్లో విషాద ఘటన జరిగింది. మైహర్లోని ఒక హోటల్లో జబల్‌పూర్‌కు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని సోమవారం(నవంబర్ 23, 2026) తెల్లవారుజామున మృతి చెందింది. తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఆరుగురు స్నేహితులతో కలిసి ఆమె హోటల్కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. జబల్‌పూర్‌కు చెందిన ఏడుగురు యువతీయువకులు సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు మైహర్ చేరుకున్నారు.
A young girl went out with her friends without informing her family. The next morning, her family got the news of her death. She went to religious city Maihar to celebrate her 21st birthday with her boyfriend, elder sister, a female friend and some other boys. They booked three separate rooms in a hotel near Sharda Devi Temple. Around 4 AM, her health suddenly got worse. Her boyfriend informed others, and they rushed her to the hospital. But doctors declared her dead. When they tried to take her body away, hospital staff stopped them and informed the police. During police questioning, her boyfriend reportedly said that she had excessive bleeding from her private parts and was also vomiting. Police informed her family and sent the body for postmortem. An investigation is going on. Police and media have not revealed anyone’s identity yet.
— Pasha Nadeem (@PashaNadeem3) November 24, 2026
దేవీజీ రోడ్డులో ఉన్న ఆస్థా యాత్రి నివాస్ గెస్ట్ హౌస్‌లో మూడు రూమ్‌లు బుక్ చేసుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక రూమ్‌లో ఉన్న విద్యార్థిని ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. వెంటనే ఆమె స్నేహితులు సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ఆమె అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు.
హాస్పిటల్ దగ్గర విద్యార్థిని మృతదేహాన్ని జబల్‌పూర్ తీసుకెళ్లే విషయంలో వివాదం జరిగింది. పోలీసులు రాకముందే మృతదేహాన్ని తమకు అప్పగించాలని ఆమె స్నేహితులు కోరారు. దీనికి డాక్టర్లు నిరాకరించారు. సమాచారం అందుకున్న కోత్వాలీ పోలీసులు హాస్పిటల్‌కు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి తరలించారు.
పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. గెస్ట్ హౌస్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇందుకోసం డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థినితో పాటు వచ్చిన ఇద్దరు యువతులు, నలుగురు యువకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
