డిగ్రీ కాలేజ్ హాస్టల్‌లో బిడ్డను కన్న స్టూడెంట్.. మహబూబాబాద్లో ఘటన

డిగ్రీ కాలేజ్ హాస్టల్‌లో బిడ్డను కన్న స్టూడెంట్.. మహబూబాబాద్లో ఘటన

మహబూబాబాద్: మహబూబాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల హాస్టల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్‌లోనే డిగ్రీ విద్యార్థినికి హాస్టల్ సిబ్బంది ప్రసవం చేశారు. కళాశాల సిబ్బంది ప్రసవం అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి సదరు డిగ్రీ విద్యార్థినిని తరలించారు. 

విద్యార్థిని మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు మృతి చెందడం శోచనీయం. విద్యార్థినికి వైద్య చికిత్స కొనసాగుతుంది. విద్యార్థినికి ప్రసవం జరిగే వరకు కళాశాల యాజమాన్యం ఏం చేస్తోందంటూ విద్యార్థి సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఈ ఘటనపై పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు కళాశాల సిబ్బంది సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. విద్యార్థినులపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ పీడీఎస్‌యూ రాష్ట్ర  ఉపాధ్యక్షుడు నాయకులు భోనగిరి మధు మండిపడ్డారు. 

కళాశాల ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేశాయి. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.