ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ యంగ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'రాకా' . ఇప్పటికే సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్టులోకి బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం.. గోవిందా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. ఆయన పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ కథలో చాలా కీలకంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే గోవిందాకు ఇదే తొలి దక్షిణాది సినిమా అవుతుంది. అయితే ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ కాంబినేషన్ నిజమవుతుందా? లేదా? అన్న ఆసక్తి నెలకొంది.
ఇక 'రాకా'లో ఇప్పటికే భారీ తారాగణం నటిస్తున్నట్లు సమాచారం.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, రమ్యకృష్ణ, యోగిబాబు, జిమ్ సర్బ్ వంటి ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో అందరి పాత్రలపై అధికారికంగా ప్రకటించలేదు..ఈ సినిమా సెప్టెంబర్ 2026లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఒకేసారి 37 మంది కళాకారులను రియల్ టైమ్‌లో మోషన్ క్యాప్చర్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఇందుకోసం 92 కెమెరాలను ఉపయోగించడం విశేషం.
ఇక డిసెంబర్ 2026లో సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది. 2019లో 'రంగీలా రాజా' తర్వాత థియేటర్లకు దూరంగా ఉన్న గోవిందా.. 'రూపా', 'దునియాదారి' సినిమాలతోనూ రీఎంట్రీకి ఇచ్చారు. మరి 'రాకా'లో ఆయన ఎంట్రీ నిజమైతే అల్లు అర్జున్‌తో కలిసి వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి..
