బాలీవుడ్ భామ మలైకా అరోరాతో బ్రేకప్ తర్వాత హీరో అర్జున్ కపూర్, నటి, స్పోర్ట్స్ ప్రజెంటర్, కంటెంట్ క్రియేటర్ సాహిబా బాలి ప్రేమాయణం నడుపుతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. గత కొంతకాలంగా వీరిద్దరి గురించి వినిపిస్తున్న ఈ డేటింగ్ రూమర్స్‌కు లేటెస్ట్ ఫొటో మరింత ఆజ్యం పోసింది. గురుపురబ్ సందర్భంగా సాహిబా షేర్ చేసిన ఓ చిన్న సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది. అందులోనూ ఆమె పెట్టిన క్యాప్షన్ నెటిజన్లకు మరింత ఆసక్తిని కలిగిస్తోంది.
నవంబర్ 24న సాహిబా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అర్జున్ కపూర్‌తో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. ఇద్దరూ తలపై వస్త్రాలు కప్పుకుని సంప్రదాయబద్ధంగా కనిపించారు. ఈ ఫొటోకు ఆమె.. "అతని వాటా ప్రసాదాన్ని కూడా నేనే తినేశాను. హ్యాపీ గురుపురబ్" అంటూ సరదా క్యాప్షన్ జోడించింది. దీంతో అసలు వీరిద్దరి మధ్య బంధం ఏంటి? అంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. కొందరైతే ఇదేదో సీక్రెట్ రిలేషన్‌షిప్‌కు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి ఈ రూమర్స్‌కు లండన్‌లోనే పునాది పడింది . భారత్, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌కు జూలై 19న అర్జున్, సాహిబా కలిసి హాజరయ్యారు. స్టేడియంలో పక్కపక్కనే కూర్చుని మ్యాచ్ వీక్షిస్తున్న వీరి ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే అప్పట్లో ఈ ప్రచారంపై సాహిబా తనదైన శైలిలో స్పందించింది. అర్జున్‌తో ఉన్న ఫొటోకు కూడా ప్రతిదీ నమ్మకండి అంటూ హింట్ ఇచ్చింది.
అంతే కాదు అర్జున్ పుట్టినరోజున సాహిబా చేసిన పోస్ట్‌కు అతడు ఇచ్చిన రిప్లై కూడా అప్పట్లో వైరల్ అయింది. 'హ్యాపీ బర్త్‌డే.. అందరి బెస్ట్ ఫ్రెండ్' అంటూ ఆమె విష్ చేయగా.. 'నువ్వు కూడా నాతో చేరాలని ఎదురుచూస్తున్నా' అంటూ అర్జున్ బదులిచ్చాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ ఫొటో రెడ్డిట్‌లోనూ చక్కర్లు కొడుతోంది. కొందరు ఇది సాఫ్ట్ లాంచ్ అంటూ కామెంట్ చేస్తుంటే, మరికొందరు వీరు కేవలం మంచి స్నేహితులై ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
అయితే తమ రిలేషన్‌షిప్‌పై ఇప్పటివరకు అర్జున్ కానీ, సాహిబా కానీ అధికారిక ప్రకటన చేయలేదు. అర్జున్ చివరిగా 'మేరే హస్బెండ్ కీ బీవీ' (2025)లో కనిపించగా, సాహిబా 'లైలా మజ్ను', 'అమర్ సింగ్ చమ్కీలా' వంటి చిత్రాల్లో నటించింది. మరి ఈ ప్రసాదం ఫొటో వెనుక ఉన్న అసలు కథేంటి? స్నేహమా.. ప్రేమా? అన్నది ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తేనే తెలియాలి...
Shahiba Bali confirmed everything 👀 She shared half prashad with her to be better half (Arjun Kapoor) during Gurupurab. While Malaika Arora Khan is busy inaugurating IVF centres in India. Arjun Kapoor is playing another game. In past also, their chemistry was seen but it's now taking a good shape 👀 >Spotted together at Lord's Cricket Ground in London on July 19, 2026, during the India vs England third ODI. >During his bday Shared screenshot of her video call with Arjun, She wrote: "HBD to sabka bestieee. Stop losing more weight, eat some cake." Arjun responded: "Waiting for u to join me." >Sahiba suggested that Arjun should try cricket commentary. Arjun responded, "Chalo u & me together... let's go for it... karte hai"
— Chota Don (@choga_don) November 25, 2026
