- మహబూబ్ నగర్- రంగారెడ్డి - హైదరాబాద్ లలో 5.68 లక్షల మంది
- వరంగల్-ఖమ్మం-నల్గొండలో 6.21 లక్షల మంది
- అత్యధికంగా రంగారెడ్డిలో 1.44 లక్షలు, మేడ్చల్ లో 1.36 లక్షలు
- 80,635 మంది దరఖాస్తుల తిరస్కరణ
- గతంతో పోలిస్తే 1.94 లక్షల మంది ఎక్కువ
- డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు.. 30న తుది జాబితా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాల ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. మహబూబ్ నగర్ ---రంగారెడ్డి-హైదరాబాద్ స్థానం ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, వరంగల్-ఖమ్మం నల్గొండ స్థానం ఎమ్మె లీ తీన్మార్ మల్లన్న పదవీకాలం 2027 మార్చి 29తో ముగియనుండటంతో, 2026 నవంబర్ 1 అర్హత తేదీగా కొత్తగా (డీ-నోవో) ఓటర్ల నమోదు చేపట్టారు.
పాత ఓటర్ల జాబితా వర్తించదని, ప్రతి ఒక్కరూ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 2 నియోజకవర్గాల పరిధిలోని 21 జిల్లాల నుంచి 12,69,826 మంది పట్టభద్రులు దరఖాస్తు చేసుకోగా, పరిశీలన తర్వాత 11,89,191 మందిని అర్హులుగా గుర్తించి ముసాయిదా జాబితాలో చేర్చారు.సరైన పత్రాలు లేకపోవడం, నిబంధనలు పాటించక పోవడం వంటి కారణాలతో 80,635 దరఖాస్తులను ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు తిరస్కరించారు.
ఇదీ ఓటర్ల లెక్క
9 జిల్లాల పరిధిలోని 156 మండలాలతో కూడిన మహబూబ్ నగర్ -రంగారెడ్డి - హైదరాబాద్ నియోజకవర్గంలో 5,99,419 దరఖాస్తులు రాగా... 5,68,105 మందిని అర్హులుగా తేల్చారు. 31,314 దరఖాస్తులు తిరస్కరించారు.
ఇక్కడ అత్యధికంగా రం గారెడ్డి జిల్లాలో 1,44,161 మంది. మేడ్చల్-మల్కాజి గిరిలో 1,36,239 మంది, . హైదరాబాద్ లో 97,247 మంది ఓటర్లుగా నమోదుకాగా, అతి తక్కువగా నారాయణపేటలో 18,846 మంది, జోగులాంబ గద్వాల లో 21,820 మంది ఉన్నారు. 12 జిల్లాల పరిధిలోని 192 మండలాలతో కూడిన వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో 6,70,407 దరఖాస్తులు రాగా, 6,21,086 మందిని అర్హులుగా గుర్తించారు. 49,321 దరఖాస్తులు తిరస్కరించారు.
ఇక్కడ అత్య ధికంగా నల్గొండలో 1,07,003 మంది, ఖమ్మంలో 1,01,671 మంది, సూర్యాపేటలో 68,813 మంది ఉండగా, సిద్దిపేట (నాలుగు మండలాలే)లో 6,392 మంది. ములుగులో 14,204 మంది ఓటర్లుగానమోదయ్యారు.
మహిళల కంటే పురుషులే ఎక్కువ
ముసాయిదా జాబితాలో మహిళలకంటే పురుషపట్ట భద్రులే ఎక్కువగా ఉన్నారు. రెండు నియోజకవర్గాల్లో కలిపి 7,10,652 మంది పురుషులు, 4,78,528 మంది మహిళలు, 11 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మహబూబ్ నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ నియోజకవర్గంలో 3,36,668 మంది పురుషులు, 2,31,433 మంది మహిళలు, నలుగురు థర్డ్ జెండర్లు ఉండగా, వరంగల్-ఖమ్మం - నల్గొండ నియోజకవ ర్గంలో 3,73,984 మంది పురుషులు 2,47,095 మంది మహిళలు, ఏడుగురు థర్డ్ జెండర్లు ఉన్నారు.
డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు
ముసాయిదా జాబితాపై ఈ నెల 25 నుంచి డిసెంబర్ 10వరకు క్లెయిములు, అభ్యంతరాలు తెలపవచ్చని సీఈవో చెప్పారు. ఇప్పటివరకు దరఖాస్తు చేయనివారు. జాబితాలో పేర్లు లేనివారు కొత్తగా ఓటు సమోదుకు ఫామ్- 18. అభ్యంతరాలు లేదా పేర్ల తొ లగింపునకుఫామ్ 7. వివరాల సవరణకు ఫామ్-8 ద్వారా ceotelangana.nic.inలో ఆన్లైన్లో, లేదా సంబంధిత ఈఆర్వో, ఏఈఆర్వోలకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
అర్హత తేదీ (2026 నవంబర్ 1)కి కనీసం మూడేండ్ల ముందు, అంటే 2023 అక్టోబర్ 31 నాటికి లేదా అంతకంటే ముందు డిగ్రీ పూర్తి చేసినవారే ఓటు హక్కుకు అర్హు లని స్పష్టం చేశారు. వచ్చిన అభ్యంతరాలన్నింటినీ డిసెంబర్ 25 నాటికి పరిష్కరించి, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని, ఆ తర్వాత కూడా నామినేషన్ల చివరి తేదీ వరకుఫామ్ 18 ఇచ్చే వెసులుబాటు ఉంటుందని తెలిపారు..
గతం కంటే పెరిగిన ఓటర్లు
2021 ఎన్నికల నాటికి మహబూబఖ నగర్-రంగా రెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో 5,31,268 మంది ఓటర్లు ఉండగా, ముసాయిదా జాబితాలోనే ఆ సంఖ్య 5,68,105కు చేరింది. అంటే ఇప్పటికే 36,837 మంది అదనంగా నమోదయ్యారు. 2024 ఉపఎన్నిక సమయంలో వరంగల్ -ఖమ్మం-నల్గొండ స్థానంలో 4,63,839 మంది ఓటర్లు ఉండగా, తాజా జాబితాలో 6,21,086 మందికి చోటు దక్కింది. అంటే 1.57.247 మంది పెరిగారు. మొత్తంగా గత ఎన్నికల నాటి 9.95,107 మందితో పోలిస్తే, ముసాయిదా దశలోనే 2 స్థానాల్లో కలిపి 1,94,084 మంది (19.50 శాతం) ఎక్కువగా నమోదయ్యారు.
1,703 పోలింగ్ కేంద్రాలు
మహబూబ్ నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ పరిధిలో 809, వరంగల్-ఖమ్మం-నల్గొండ పరిధిలో 894 మొత్తం 1,703 కేంద్రాలను సీఈ ఏర్పాటు చేసింది. జాబితాలో అక్రమాలు జరగకుండా పర్యవేక్షించేందు కు ఆరుగురు సీనియర్ ఐపిఎస్ అధికారులను 'ఎల క్టోరల్ రోల్ అబ్జర్వర్లు'గా ఈసీఐ నియమించింది. గుర్తింపు పొందిన అన్ని జాతీయ, రాష్ట్ర పార్టీల ప్రతి నిధులకు ముసాయిదా జాబితా హార్డ్, సాఫ్ట్ కాపీలు అందజేశామని సీఈవో తెలిపారు.
