- పనులపై విజిలెన్స్ నిఘా పెట్టండి
- రోజూ ప్రగతి నివేదికలివ్వాలని ఆఫీసర్లకు సీఎం ఆదేశాలు
హైదరాబాద్ వెలుగు: తెలంగాణను అంతర్జాతీయక్రీడా కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిం చనున్న 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026' రాష్ట్ర క్రీడారంగానికి బలమైన పునాదిగా నిలవాలని అధి కారులను ఆదేశించారు. క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఉన్నతాధికారులతో కలిసి పోటీల ఏర్పాట్లపు రోగతిపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఖేలో ఇండియా ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లాలవారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. హైదరాబా ద్, రంగారెడ్డి జిల్లాల బాధ్యతలను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో సమన్వయం చేసుకుంటూ మంత్రి వాకిటి శ్రీహరి పర్యవేక్షించాలని సూచించారు. మహబూబ్ నగర్ బాధ్యతలను మంత్రి జూపల్లి కృష్ణారావుకు, వరంగల్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి, కరీంనగర్ ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు, ఖమ్మంను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు.. నిజామాబాద్ ను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి అప్పగించారు. నోడల్ ఆఫీసర్ల నుంచి రోజూ ప్రగతి నివేదికలు తెప్పించుకోవాలని, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
రూ.120 కోట్లతో స్టేడియాల ఆధునికీకరణ..
2002లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నేషనల్ గేమ్స్ తర్వాత దాదాపు 24 ఏళ్లకు తెలంగాణలో జరుగుతున్న అతిపెద్ద జాతీయ క్రీడోత్సవం ఇదేనని సీఎం రేవంత్ గుర్తుచేశారు. అప్పటి పోటీల్లో 8 వేల మందిపాల్గొంటే.. ఈసారి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 9 వేల మందికి పైగా అథ్లెట్లు, అధికారులు హాజరవుతు న్నారని తెలిపారు.
ఈ పోటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.203 కోట్లు, కేంద్రం రూ.21 కోట్లు ఖర్చు చేస్తున్నా యనిచెప్పారు. ప్రారంభ వేడుకల ఆర్భాటాలకు ఖర్చు చేయకుండా రూ.120 కోట్లను స్టేడియాల శాశ్వత ఆధునికీకరణ, 27 క్రీడలకు అవసరమైన అత్యాధునిక పరికరాల కొనుగోలుకే వినియోగించాలని అధికారులను ఆదేశించారు.
డిసెంబర్ 11న చారిత్రక ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవం, గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని సూచించారు.స్టేడియాల ఆధునికీకరణ, మైదానాల నాణ్యతలో రాజీ పడొద్దని, పనులపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ నిఘా పెట్టాలని ఆదేశించారు. మొత్తం 20 వేదికల్లో 14 స్టేడియాల పనులు పూర్తయ్యాయని, మిగిలిన ఆరు చోట్ల ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. టాయిలెట్లు, ఇతర అవసరాలకు ఎస్టీపీలద్వారా శుద్ధి చేసిన రీసైకిల్డ్ నీటినే వాడాలని సూచించారు.
తెలంగాణ అథ్లెట్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి..
తెలంగాణ తరపున బరిలోకి దిగే అథ్లెట్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సీఎం రేవంత్ చెప్పారు. 27 క్రీడల్లో ఎంపిక చేసిన 1,334 మంది అథ్లెట్లకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం తరపున పాల్గొనే 861 మంది క్రీడాకారులు, కోచ్‌లకు ట్రాక్ సూట్లు, టీషర్టులు, షూస్ తదితర అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ కిట్లను నాణ్యతతో అందించాలని ఆదేశించారు.
ప్రతిభావంతులను గుర్తించి అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్లుగా తీర్చిదిద్దేందుకు దేశంలోనే అత్యుత్తమ కోచ్ లను నియమించాలని సూచించారు. తెలంగాణ సంప్రదాయ యుద్ధకళ 'కర్రసాము'ను ఈ పోటీల్లో జాతీయ స్థాయి డెమో స్పోర్ట్ గా చేర్చినట్లు సీఎం వెల్లడించారు.
ఒలింపిక్స్ లో పతకాలే లక్ష్యంగా ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీ అమలు చేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో 'యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని..దక్షిణ కొరియాలోని 'కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటీ'తో భాగస్వామ్యం కుదురుకున్నామని వివరించారు.
