- అందాల భామ జెన్నిఫర్ బారెటోకు కిరీటం
- సొంతగడ్డపై 115 మందిని వెనక్కినెట్టి విజయం
- పెండ్లయిన మహిళ, తల్లి గెలవడం చరిత్రలో ఇదే తొలిసారి
- 'ఏఐతో మన విలువలకు ముప్పు రావొద్దు' సమాధానానికి ఫిదా
- టాప్-30కే పరిమితమైన భారత యువతి కాజియా లిజ్ మెజో
- సమస్యలు, వ్యాపార వివాదాలతో పలు దేశాలు దూరం
శాన్ జువాన్: మిస్ యూనివర్స్ కిరీటాన్ని ప్యూర్టోరికో భామ జెన్నిఫర్ బారెటో సొంతం చేసుకున్నారు. సొంతగడ్డపై జరిగిన ఫైనల్లో 115 మంది పోటీ దారులను వెనక్కి నెట్టి ఆమె విజేతగా నిలిచారు. బుధవారం ప్యూర్టోరికో రాజధాని శాన్ జువాన్లో గ్రాండ్ ఫినాలే నిర్వహించారు.
27 ఏండ్ల జెన్నిఫర్ సోషల్ వర్కర్ గా పనిచేస్తున్నారు. మిస్ యూనివర్స్ నిర్వాహకులు పెళ్లైన మహిళలు, తల్లులు పోటీల్లో పాల్గొనడంపై ఉన్ననిషేధాన్ని మూడేండ్ల క్రితం ఎత్తి వేసిన తర్వాత.. విజేతగా నిలిచిన తొలి వివాహిత, తొలి తల్లిగా జెన్నిఫర్ రికార్డు సొంతం చేసుకున్నారు.
డొమినికన్ రిపబ్లిక్ కు చెందిన మెలిస్సా నునెజ్ తొల్లి రన్నరప్ గా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ండో రన్నరప్ గా నిలిచారు. ఇండియా నుంచి పోటీపడిన. కేరళకు చెందిన 19 ఏండ్ల కాజియా లిజ్ మెజోటాప్ 30లో చోటు దక్కించుకున్నా.. టాప్12లో నిలువ లేకపోయారు.
గత ఏడాది విజేత మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్.. జెన్నిఫర్కుర్ కు కిరీటం అలంకరించా రు. మిస్ యూనివర్స్ పోటీల్లో ఇప్పటివరకు భారత్ మూడుసార్లు విజేతగా నిలిచింది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా. 2021లో హర్నాజ్ సంధు ఈ కిరీటాలను గెలుచుకున్నారు.
ఏఐ వల్ల విలువలకు ముప్పు ఏర్పడొద్దు
జెన్నిఫర్ తొలుత ప్రిలిమినరీ పోటీల్లో న్యాయనిర్ణేతలు ఇచ్చిన మార్కుల ఆధారంగా ఎలిమినేషన్ రౌండ్ నిర్వహిం చారు. మిగిలిన 30 మంది స్విమూట్ రౌండ్ లో పా ల్గొన్నారు. వీరిలో 12 మందిని ఎంపిక చేసి ఈవెనింగ్ గౌన్లెండ్ నిర్వహించారు.
చివరకు ఐదుగురు ఫైనలి స్థులు..
న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానా లిచ్చారు. 'ఏఐవిస్తరిస్తున్న ఈ స మయంలో మనం ఎప్పటికీ కోల్పోకూడని మానవ విలువ ఏది' అని జెన్నిఫర్ ను ప్రశ్నించారు. దీనికి ఆమె స్పానిష్ లో సమాధానమిస్తూ... 'ఏఐని బాధ్యతాయుతంగా వాడాలి. ఏఐ వల్ల మన విలువలకు ముప్పు ఏర్పడితే.. అవి అసలు విలువలే కావు..చెప్పేమాటలకు, చేసేపనులకు మధ్య తేడా లేకపోవడమే విలువ' అని పేర్కొన్నారు.
వీసా సమస్యలు.. వ్యాపార వివాదాలు
ఈసారి పోటీకి ముందు నుంచే వివాదాలు కొనసాగా యి. నేపాల్ తో పాటు ఐదు ఆఫ్రికా దేశాలకు చెందిన యువతులు అమెరికా వీసాలు పొందడంలో ఇబ్బందుల కారణంగా పోటీ నుంచి తప్పుకున్నారు. క్వాలిఫయింగ్ పోటీలను నిర్వహించే థాయ్ బిజినెస్మిన్ సవాత్ ఇట్సరాగ్రిసిల్ తో మిస్ యూనివర్స్ సంస్థకు ఒప్పంద వివాదం కొనసాగింది. దీంతో ఇండోనేసియా, లావోస్, మలేసియా, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాం దేశాల ప్రతినిధులు ఫైనల్ కు దూరమయ్యా రు. గత ఏడాది ఫైనల్లో ఓటింగ్ అక్రమాలు, పక్షపా తం జరిగాయన్న ఆరోపణలపై నిరసనగా ఫ్రాన్స్ ఈ ఏడాది తమ ప్రతినిధిని వెనక్కి తీసుకుంది.
3,150 వజ్రాలతో కిరీటం
మిస్ యూనివర్స్ పోటీలు 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కిరీటాన్ని రూపొందించారు. ఫిలిప్పీన్స్ లో తయారైన ఈ కిరీటాన్ని జార్జ్ విటెల్స్, పారిస్ కు చెందిన ఆభరణాల సంస్థ మైసన్ డిఓర్ కలిసి డిజైన్ చేశారు. వైట్గోల్లో 3,150 వజ్రాలను పొదిగారు. వచ్చే ఏడాది 76వ మిస్ యూనివర్స్ పోటీలకు వియత్నాం ఆతిథ్యం ఇవ్వనుంది.
