మందమర్రిలో ఏడు ఎకరాల్లో ఇందిరమ్మ టవర్స్ ..హైదరాబాద్ తరహాలో నిర్మిస్తాం: మంత్రి వివేక్

మందమర్రిలో  ఏడు ఎకరాల్లో ఇందిరమ్మ టవర్స్ ..హైదరాబాద్ తరహాలో నిర్మిస్తాం: మంత్రి వివేక్
  • సింగరేణి నుంచి భూమిని సేకరిస్తున్నం
  • టామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కామ్​ ద్వారా జర్మనీ భాషా నేర్చుకున్న యువతకు ఉపాధి 
  • జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇందిరమ్మ కుటుంబ 
  • జీవిత బీమా ప్రారంభించిన మంత్రి

కోల్​బెల్ట్/జైపూర్/చెన్నూరు, వెలుగు: మందమర్రిలో ఏడు ఎకరాల్లో హైదరాబాద్​తరహాలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్​ నిర్మిస్తామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​వెంకటస్వామి తెలిపారు. బుధవారం మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం, చెన్నూరు, మందమర్రి మున్సిపాలిటీల్లో మంత్రి పర్యటించారు. 

జైపూర్​ మండలం గంగిపల్లి నుంచి ఎల్కంటి వరకు రూ.1.57కోట్లతో నిర్మించిన పంచాయతీరాజ్​ రోడ్డును, మందమర్రి మున్సిపాలిటీలో పలు వార్డుల్లో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. కొత్త రహదారుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

 జైపూర్​మండలం టేకుమట్లలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించారు. జైపూర్, మందమర్రి బి–1 క్యాంపు ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వివిధ విభాగాల ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్​ ముఖ్య లీడర్లతో పలు అభివృద్ధి పనులు, మందమర్రిలోని స్కిల్​డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కామ్​ ఆధ్వర్యంలో జర్మనీ భాషను నేర్చుకుంటున్న అభ్యర్థులతో మంత్రి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్​ వెంకటస్వామి మాట్లాడుతూ.. చెన్నూరు నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరుచేశామని తెలిపారు. 

మందమర్రిలో అర్హులకు డబుల్​బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్ ​ఇండ్లను కేటాయించి.. అక్కడ అభివృద్ధి పనులకు రూ.3కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో ఒక్క డబుల్​బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్​కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. మందమర్రి మున్సిపాలిటీ ఏజెన్సీ యాక్ట్​ పరిధిలో ఉండడంవల్ల ఇండ్లు మంజూరు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించారు. 

ఈ సమస్య పరిష్కారానికి సింగరేణి సంస్థతో చర్చించినట్టు వివరించారు. సింగరేణికి చెందిన సుమారు 7 ఎకరాల భూమిని గుర్తించామని, అక్కడ 1000 ఇండ్లతో ఇందిరమ్మ టవర్స్​ నిర్మించేందుకు ప్లాన్ చేసినట్టు తెలిపారు. చెన్నూరు క్యాంపు ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఫిర్యాదుల బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 70శాతం మంది ఇండ్లను కేటాయించాలని కోరారని, దీంతో మందమర్రిలో ఇందిరమ్మ టవర్స్​ఏర్పాటు చేయాలన్న 
ఆలోచన వచ్చిందన్నారు. 

కేసీఆర్ వల్లే రాష్ట్ర ఆర్థికపరిస్థితి ఆగమైంది 

కేసీఆర్​అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైందని మంత్రి వివేక్​ 
వెంకటస్వామి అన్నారు. రూ.8లక్షల కోట్ల అప్పులు చేయడంతో ఏటా రూ.80వేల కోట్ల మిత్తి కడుతున్నామని పేర్కొన్నారు. త్వరలో మహిళలకు మంచి డిజైన్లతో ఇందిరమ్మ చీరలను పంపిణి చేయనున్నట్టు చెప్పారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని వెల్లడించారు. 

రెండేళ్లలో ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ 

 బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ పదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. వాళ్ల నిర్లక్ష్యం వల్ల చెన్నూరు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు ఆధ్వానంగా ఉండేవని, తాను ఎమ్మెల్యే అయిన తర్వాత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, హైమాస్ట్​ లైట్ల ఏర్పాటు పనులను చేపడుతున్నట్టు వెల్లడించారు. 

మందమర్రిలో ప్రస్తుతం రూ.50కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు వివరించారు. రెండేళ్లలో రోడ్డు, డ్రైనేజీ లేని కాలనీ అంటూ ఉండదన్నారు. త్వరలో మందమర్రిలో 50 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని తెలిపారు. గంగిపల్లిలో 118 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటికే 85 ఇండ్లు వివిధ దశలలో ఉన్నాయని చెప్పారు. గ్రామ పాఠశాల అభివృద్ధికి రూ.80లక్షలు మంజూరు చేశామని పేర్కొన్నారు.

 జర్మనీలో ఉద్యోగ అవకాశాలు 

 మందమర్రిలోని స్కిల్స్​సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కామ్ ఆధ్వర్యంలో జర్మన్ భాష శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులను మంత్రి వివేక్​అభినందించారు. ప్రస్తుతం బి–1 స్థాయి శిక్షణ పూర్తి చేసుకున్న వారు బి–-2 స్థాయిని కూడా విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. జర్మన్ భాషలో ప్రావీణ్యం సాధించడంతో పాటు అవసరమైన పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తే జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

ఉదయం చెన్నూరు మున్సిపల్ వార్డుల్లో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యం బారిన పడిన కాంగ్రెస్ నాయకులు దాసరి కమల్ , నాలుగో వార్డ్ కౌన్సిలర్ పెండ్యాల సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి ఆరోగ్య పరిస్థితులను ఆరా తీశారు. ఒకటవ వార్డ్ మాజీ కౌన్సిలర్ పోగుల సతీష్ నాన్నమ్మ పోగుల చిన్నక్క ఇటీవల అనారోగ్యంతో మరణించగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. 

మంత్రి వెంట ఏసీపీ వెంకటేశ్వర్లు, మందమర్రి, చెన్నూరు మున్సిపల్​ కమిషనర్లు తుంగపిండి రాజలింగు, మారుతీ ప్రసాద్​, చెన్నూరు తహసీల్దార్ మల్లికార్జున్, మందమర్రి సీఐ పర్స రమేశ్​, జైపూర్​ఎంపీడీవో శ్రీపతిబాపు పాల్గొన్నారు.